నా కంటే తెలివైనవారు, డిజిటల్ ఆంధ్రప్రదేశ్: చంద్రబాబు
హైదరాబాద్: పిల్లలు తన కంటే తెలివైన వారు చాలామంది ఉన్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం అన్నారు. గుంటూరు పోలీస్ పరేడ్ మైదానంలో గురుపూజోత్సవ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాస రావు, రావెల కిశోర్ బాబు, నర్సారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం చంద్రబాబు మాట్లాడారు.
సర్వేపల్లి రాధాకృష్ణన్ అందరికీ ఆదర్శమన్నారు. భావితరాలకు ఆయన స్ఫూర్తి అన్నారు. సర్వేపల్లి మనవాడని, తెలుగువాడని, రాష్ట్రపతిగా ఎదిగారన్నారు. ఉపాధ్యాయుడు అనే వ్యక్తి ఆత్మగౌరవంతో బతకాలన్నారు. ఉపాధ్యాయుడికి గౌరవముండాలని, మీ వృత్తి పైన మీకు కూడా గౌరవం ఉండాలన్నారు. ఉపాధ్యాయుడు ఆత్మగౌరవంతో ఉండాలనే కౌన్సెలింగ్ తీసుకు వచ్చామన్నారు. ఉపాధ్యాయుల వద్ద డబ్బు తీసుకొని ట్రాన్సుఫర్లు చేయడం సరికాదన్నారు.
పౌష్టికాహారం లోపం తగ్గించేందుకు మధ్యాహ్నం భోజనం ప్రవేశ పెట్టామన్నారు. తీర ప్రాంతంలో 14 పోర్టులు అభివృద్ధి చేస్తామన్నారు. వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతం మన ఆస్తి అన్నారు. రాష్ట్రంలో పంటలకు కొదువ లేదన్నారు. తమ హయాంలో రాష్ట్రంలో 17 శాతం అక్షరాస్యత పెంచామన్నారు. ప్రభుత్వాల వల్ల విద్యారంగం భ్రష్టు పట్టించిందన్నారు. రాబోయే ఐదేళ్లలో ఏపీని వందశాతం అక్షరాస్యతగా నిలబెట్టాలని తాను ఉపాధ్యాయులను కోరుతున్నానని చెప్పారు.

ప్రపంచంలో సామాజిక మార్పు వస్తోందన్నారు. విద్యా, ఉద్యోగాల్లో తమ హయాంలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించామన్నారు. 2004లో మిగులు కరెంట్ సాధించామన్నారు. పవర్ గ్రిడ్ ద్వారా నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. గతంలో తాను ప్రతి ఒక్కరు సెల్‌ఫోన్ పెట్టుకోవాలని చెబితే వెక్కిరించారని, ఇప్పుడు టెక్నాలజీ పెరిగి అందరు సెల్‌ఫోన్ వాడుతున్నారన్నారు. ఇంట్లో లెట్రిన్ లేకపోయినా సెల్‌ఫోన్ వాడుతున్నారని నవ్వుతూ చెప్పారు.
భారత దేశం డిజిటల్ ఇండియాగా మారబోతుందని, అందులో మొదటి రాష్ట్రం ఏపీని డిజిటల్ రాష్ట్రంగా చేసుకుందామన్నారు. బస్ స్టేషన్లలో, పాఠశాలల్లో హైఫై ప్లాన్ చేస్తామన్నారు. ఇప్పటి విద్యార్థులు ఇంటర్నెట్‌కు వెళ్లి మనకే పాఠాలు చెబుతున్నారన్నారు. అవసరమైతే విద్యార్థులకు ఐపాడ్‌లు ఇస్తామన్నారు. మన పిల్లలకు సరైన విద్యను అందిస్తే ప్రపంచాన్ని శాసిస్తారన్నారు. విద్యార్థులను శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలుగా తయారు చేయవచ్చన్నారు.
రాజధాని ప్రకటన పైన అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారన్నారు. మనం హైదరాబాదు నుండి కట్టుబట్టలతో వచ్చామన్నారు. అందుకు యూపీఏ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. అందుకే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీని ప్రజలు చిత్తుగా ఓడించారన్నారు. కాంగ్రెస్ పాలనలో విద్యుత్ వ్యవస్థను దెబ్బతీశారన్నారు.
లోకేష్‌ను ప్రతిష్టాత్మక స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదివించానని, తన కోడలిని కూడా చదివించానని చెప్పారు. విద్యకు తాను ప్రాధాన్యతను ఇస్తానని చెప్పారు. పాలసీలను తానే క్రియేట్ చేస్తున్నానని చెప్పారు. ఇతర దేశాల వారు ఇక్కడకు వచ్చి చదువుకునేలా అభివృద్ధి జరగాలన్నారు.
తనకు అసెంబ్లీ సమావేశాల కన్నా ఉపాధ్యాయుల దినోత్సవమే ముఖ్యమన్నారు. విద్యార్థులతో సహా అందర్నీ ఉపయోగించుకొని ఏపీని స్వర్ణాంధ్ర ప్రదేశ్ చేస్తామన్నారు. మనిషిలో ఆలోచన ఉంటే, ప్రణాళికాబద్దంగా కృషి చేస్తే ప్రపంచంలో ఏదీ అసాధ్యం కాదన్నారు. తాను సామాన్య రైతు కుటుంబంలో పుట్టానని, అయితే, వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పారు. కేంద్రం రాష్ట్రానికి 12 విద్యాసంస్థలు ప్రకటించిందన్నారు.
ప్రతి ఉపాధ్యాయుడికి ఐపాడ్ ఇస్తామన్నారు. ఏపీని నాలెడ్జ్ హబ్‌గా చేస్తానని చెప్పారు. ప్రతి మండలం నుండి సీఎం ఫెలోషిప్‌కు ఓ విద్యార్థిని ఎంపిక చేస్తామని, వారికి స్టైఫాండ్ ఇస్తామని చెప్పారు. విద్యార్థిలో నైపుణ్యం పెంచేందుకు కార్యక్రమాలు చేపడతామన్నారు. విద్యార్థుల బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోవాలని, ఉపాధ్యాయుల బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్!












Click it and Unblock the Notifications