రికార్డు: ఒకే రోజు 3లక్షల గృహ ప్రవేశాలు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా గురువారంనాడు రాష్ట్ర వ్యాప్తంగా 3లక్షల మంది పేదలు ఒకేసారి గృహప్రవేశాలు చేశారు. 'ఆనందాల లోగిళ్లు చూసొద్దాం రండి' పేరుతో ఏపీ సీఎం చంద్రబాబు పేదల గృహ ప్రవేశాలు చేశారు.
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామూహిక గృహప్రవేశాలను శాస్త్రోక్తంగా ప్రారంభించారు. వివిధ జిల్లాలో నిర్మించిన గృహ సముదాయాలను మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు లబ్ధిదారులతో మాట్లాడారు.

చంద్రబాబుతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. తాము తమ జీవితంలో ఇల్లు కట్టుకోలేమని భావించామని, ప్రభుత్వ సాయంతో ఇప్పుడు సొంత ఇంట్లోకి వెళుతున్నామని కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications