• search
శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అవసరమైతే జగన్‌తో ఆలింగనం, బాబు ఎలాంటివాడంటే: ఓటుకు నోటును లాగిన పవన్ కళ్యాణ్

By Srinivas
|
  బాబు ఎలాంటివాడంటే: ఓటుకు నోటును లాగిన పవన్ కళ్యాణ్

  శ్రీకాకుళం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పోరాట యాత్ర ఆదివారం శ్రీకాకుళం జిల్లాలో కొనసాగింది. జనసేనాని నరసన్నపేట, అక్కడి నుంచి పాతపట్నం చేరుకున్నారు. పాతపట్నంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి కవాతు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. శ్రీకాకుళం నుంచి ఇప్పుడున్న ప్రజాప్రతినిధులను, వారసత్వ రాజకీయ నాయకులను తరిమేద్దామన్నారు.

  కేంద్రం విభజన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. విభజన హామీల విషయంలో బీజేపీ, టీడీపీలది తప్పు ఉందన్నారు. నాలుగేళ్లలో 36సార్లు మాట మార్చారన్నారు. ప్రత్యేక హోదా కోసం జనసేన చిత్తశుద్ధితో పోరాటం చేస్తోందని చెప్పారు. ఏపీకి హోదా ఇస్తేనే న్యాయం జరుగుతుందన్నారు.

  పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటే

  పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటే

  ఇసుక మాఫియా పెరిగిపోయిందని పవన్ మండిపడ్డారు. శ్రీకాకుళంలో ఉన్న పాలకులను పెకిలించి, బద్దలు కొట్టి తీరాలని వ్యాఖ్యానించారు. భూమాతకు, భూదేవికి గౌరవం ఇవ్వకుంటే పాతాళానికి పోతారని హెచ్చరించారు. గిరిజనులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలంటే అందరూ భాగస్వాములు కావాలని జనసేనాని వ్యాఖ్యానించారు.

  జనసేన సభలకు సీఎం అడ్డు, ఎమ్మెల్యేల్ని, కుటుంబాలను బహిష్కరించాలి

  జనసేన సభలకు సీఎం అడ్డు, ఎమ్మెల్యేల్ని, కుటుంబాలను బహిష్కరించాలి

  నేను శ్రీకాకుళంలో ఎందుకు పుట్టలేదనిపిస్తోందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. జనసేన వల్లే టీడీపీ అధికారంలో ఉందన్నారు. జనసేన సభలకు ముఖ్యమంత్రి అడ్డుపడుతున్నారని తీవ్రవ్యాఖ్యలు చేశారు. వివక్ష, దోపిడీకి గురవుతున్న వాళ్ల పక్షన తన పోరాటం ఉంటుందన్నారు. ఇప్పుడుకున్న ఎమ్మెల్యేలను, వారి కుటుంబాలను బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

  ఏపీ కబ్జాల పాలు కావొద్దని భావించా

  ఏపీ కబ్జాల పాలు కావొద్దని భావించా

  రాజకీయ, సామాజిక మార్పును జనసేన కోరుకుంటోందని పవన్ కళ్యాణ్ చెప్పారు. అడవి తల్లి బిడ్డలకు, గంగమ్మ తల్లి బిడ్డలకు మధ్య ప్రభుత్వం గొడవ పెడుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ కబ్జాల పాలు కాకుండా ప్రభుత్వం ఏర్పాటు కావాలని తాను భావించానని, అందుకే తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చానని చెప్పారు. కానీ అలా జరగడం లేదన్నారు. వంశధార బాధితులకు ఇప్పటికీ న్యాయం జరగలేదన్నారు. పునరావాసం కల్పించడంలో విఫలమయ్యారన్నారు. రాత్రికి రాత్రి ఇళ్లు కూల్చారన్నారు. నిర్వాసితులకు వెంటనే పరిహారం ఇవ్వాలన్నారు. ఈ ప్రభుత్వంలో మానవత్వం చచ్చిపోయిందని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఇసుక మాఫియా పెరిగిపోయిందన్నారు. శ్రీకాకుళంలో ఉన్న పాలకులను పెకిలించాలని, బద్దలు కొట్టి తీరాలన్నారు.

  ఓటుకు నోటు కేసులో భయపడుతున్నారు

  ఓటుకు నోటు కేసులో భయపడుతున్నారు

  పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఆముదాలవలస కవాతులో మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు కేంద్రానికి భయపడుతున్నారని చెప్పారు. శ్రీకాకుళం ఎమ్మెల్యేలు, మంత్రి అచ్చెన్నాయుడు జనసేన పార్టీ కార్యకర్తలను వేధించవద్దని హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడ చూసినా ఇసుక దోపిడీ అన్నారు. పరిస్థితి చూస్తుంటే భవిష్యత్తులో ఇసుక మ్యూజియం వచ్చేలా ఉందన్నారు. ఏపీలో ఎక్కడ భూమి కనిపించిన టీడీపీ నేతలు లాగేసుకుంటున్నారని ఆరోపించారు.

  అవసరమైతే జగన్‌తో బాబు ఆలింగనం

  అవసరమైతే జగన్‌తో బాబు ఆలింగనం

  భూమిని, మట్టిని దోచుకునే వారు మట్టిలో కలిసిపోవాలని పవన్ అన్నారు. ఎవరికైనా పార్టీల జెండా కంటే జాతీయ జెండా ముఖ్యమన్నారు. వంశధార ప్రాజెక్టు పూర్తి కాకుండానే అక్కడి ప్రజలను మెడపట్టి గెంటేశారన్నారు. ఎక్కడకెళ్లినా అగ్రిగోల్డ్ బాధితులు కనిపిస్తున్నారన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉండాలన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేనకు పూర్తి మద్దతు వస్తే ఉద్యోగుల సీపీసీ స్కీంను పూర్తిగా రద్దు చేస్తామన్నారు. చంద్రబాబుకు వాడుకొని వదిలేయడం అలవాటు అని, అవసరమైతే ఆయన జగన్‌ను కూడా ఆలింగనం చేసుకుంటున్నారు. 2019లో వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేస్తాయన్నారు.

  సీఎం కావాలంటే చొక్కా నలగాలి, బాధలు చూసి సినిమాలు వదిలేశా

  సీఎం కావాలంటే చొక్కా నలగాలి, బాధలు చూసి సినిమాలు వదిలేశా

  ప్రతి సభలోను జనసేన కార్యకర్తలు, అభిమానులు సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేశారు. దీనిపై పవన్ మాట్లాడుతూ... మీరు నినాదాలు చేస్తే సీఎం కాలేమన్నారు. చొక్కా నలగాలి, చెమట పట్టాలి, కష్టపడి పని చేయాలన్నారు. తాను అధికారం ఆశించి రాజకీయాల్లోకి రాలేదన్నారు. ప్రజల బాధలు చూసి సినిమాలు వదిలి రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. జనసేన, ప్రజలు రోడ్ల పైకి వస్తున్నారంటే చంద్రబాబు నిర్లక్ష్యమే కారణం అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేయవద్దన్నారు. తాము చేస్తోంది నిరసన కవాతు అని, కడుపు మండి చేస్తున్న కవాతు అన్నారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  శ్రీకాకుళం యుద్ధ క్షేత్రం
  సంవత్సరం
  అభ్యర్థి పేరు పార్టీ లెవెల్ ఓటు ఓటు రేట్ ఓట్ల తేడ
  2014
  రామ్మోహన్ నాయుడు కిన్జరపు టీడీపీ విజేతలు 5,56,163 53% 1,27,572
  రెడ్డి శాంతి వైయస్సార్‌సీపీ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 4,28,591 41% 0
  2009
  కిల్లి క్రుప్ రాణి కాంగ్రెస్ విజేతలు 3,87,694 42% 82,987
  యర్రంనాయుడు కింజరాపు టీడీపీ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 3,04,707 33% 0
  2004
  ఎర్రం నాయిడు కింజరాపు టీడీపీ విజేతలు 3,61,906 50% 31,879
  కిల్లి కురురాని కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 3,30,027 46% 0
  1999
  ఎర్రం నాయిడు కింజరాపు టీడీపీ విజేతలు 3,73,851 57% 96,882
  కన్నితి విశ్వనాధహమ్ కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 2,76,969 42% 0
  1998
  కిన్జరాపు ఎర్రన్నన్నాడు టీడీపీ విజేతలు 2,86,582 43% 86,365
  అప్పాయ్య దొర హనుమంతుడు ఎన్టిఆర్టిడి పి(ఎల్ పి) రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 2,00,217 30% 0
  1996
  కిన్జరాపు ఎర్రన్నన్నాడు టీడీపీ విజేతలు 2,34,278 37% 34,578
  జయ కృష్ణ మండమూరి ఎన్టిఆర్టిడి పి(ఎల్ పి) రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 1,99,700 31% 0
  1991
  విశ్వనాదం కణితి కాంగ్రెస్ విజేతలు 2,35,641 43% 26,664
  అప్పాయిదోరా హనుమంతులి టీడీపీ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 2,08,977 38% 0
  1989
  విశ్వనాథం కనితి కాంగ్రెస్ విజేతలు 2,88,263 48% 50,114
  అప్పాయదోర హనుమంతుడు టీడీపీ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 2,38,149 39% 0
  1984
  అయ్యప్పదొర హనుమంతు టీడీపీ విజేతలు 2,98,167 61% 1,24,468
  రాజగోపలరావు బోడ్డపల్లి కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 1,73,699 35% 0
  1980
  రాజగోపలరావు బోడ్డపల్లి ఐ ఎన్సి( ఐ ) విజేతలు 1,97,336 49% 78,989
  గౌతు లాట్చన్నా జేఎన్ పి(ఎస్) రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 1,18,347 30% 0
  1977
  రాజగోపలరావు బోడ్డపల్లి కాంగ్రెస్ విజేతలు 1,87,125 49% 8,734
  గౌతు లాట్చన్నా బిఎల్డి రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 1,78,391 47% 0
  1971
  రాజగోపలరావు బోడేపల్లి కాంగ్రెస్ విజేతలు 2,33,171 69% 1,37,461
  ఎన్ జి రంగా ఎస్డబ్ల్యుఎ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 95,710 29% 0
  1967
  జి లక్షన్న ఎస్డబ్ల్యుఎ విజేతలు 1,89,771 56% 60,358
  బి రాజగోపాలరావు కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 1,29,413 38% 0
  1962
  బోడిపల్లి రాజగోపాల రో కాంగ్రెస్ విజేతలు 1,12,172 43% 31,815
  సుగ్గు శ్రీనివాస రెడ్డి ఎస్డబ్ల్యుఎ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 80,357 31% 0
  1957
  బోడెపల్లి రాజగోపాలరావు కాంగ్రెస్ విజేతలు 84,797 55% 16,356
  కరీమి నారాయణప్పల నాయుడు ఇండిపెండెంట్ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 68,441 45% 0

  English summary
  Jana Sena chief Pawan Kalyan on Sunday said that Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu is fearing with cash for voter.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more