Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబుకు మరో షాక్.. టీడీపీలో కొత్త ముసలం

సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీకి వరుస షాకులు తగులుతున్నాయి.కూటమితో పొత్తు పార్టీ అధినేత చంద్రబాబుకు కొత్త తలనొప్పులు తీసుకువస్తున్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా నేతలు అధిష్టానంపై తిరుగుబాటు చేస్తున్నారు.టికెట్ దక్కని నేతలు నేరుగానే చంద్రబాబును టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ఎంత బుజ్జగిస్తున్న అసంతృప్తులు దారికి రావడం లేదు. దాదాపు 20 నుంచి 30 నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. నేతల మధ్య వర్గపోరు తారస్థాయికి చేరుకుంది. పార్టీ గెలుపుకు సహకరించేది లేదని అసంతృప్తులు బహిరంగంగానే తెగేసి చెబుతున్నారు.

వ్యతిరేకత ఎక్కువ కావడంతో చంద్రబాబు ఇప్పటికే రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చారు. ఇప్పటికే పి.గన్నవరం అభ్యర్థి రాజేష్ మహాసేన పేరును ప్రకటించిన తరువాత ఆ స్థానాన్ని జనసేనకు కేటయించడం జరిగింది. రఘురామ కృష్ఱంరాజు కోసం ఉండి నియోజకవర్గం అభ్యర్థిని పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనపర్తి అభ్యర్థిని మారుస్తారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా మాడుగుల నియోజకవర్గంలో కూడా అభ్యర్థిని మార్చే యోచనలో ఉన్నట్టు సమాచారం అందుతోంది.

Chandrababu is planning to change the TDP candidate for Madugula constituency

మాడుగుల నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా పైలా ప్రసాద్‎ పేరును ప్రకటించారు. అయితే ఆయన అభ్యర్థిత్వంపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థిని మార్చాలని టీడీపీ క్యాడర్ డిమాండ్ చేస్తోంది. దీనికి తోడు నియోజకవర్గ ఇంఛార్జ్ పీ వీ జీ కుమార్, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడులు సైతం పైలా ప్రసాద్‎‌కు మద్దతిచ్చేది లేదని స్పష్టం చేశారు. పైలా ప్రసాద్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో అప్రమత్తం అయిన టీడీపీ అధిష్టానం ..అభ్యర్థి మార్పు దిశగా ఆలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలో మధ్యే మార్గంగా మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి పేరు తెరపైకి వచ్చింది.

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, అనకాపల్లి పార్లమెంటు కూటమి అభ్యర్ధి సీఎం రమేష్‎ బండారు అభ్యర్థిత్వానికి మద్దతు పలికారు. ఓ వైపు తీవ్ర అసంతృప్తిలో ఉన్న బండారుకు మాడుగుల టికెట్ ఇచ్చి ఆయనకు న్యాయం చేయాలనే ఆలోచనలో టీడీపీ అధిష్టానం కూడా ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఉండి, అనపర్తితో పాటు మాడుగుల అభ్యర్ధి మార్పును కూడా ఒకటి,రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉందని టీడీపీ వర్గాల సమాచారం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+