అమరావతికి పూజ: ప్రధానిని ఆహ్వానించేందుకు జపాన్‌కు బాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం రాత్రి ఒకటిన్నర గంటలకు జపాన్ బయలుదేరనున్నారు. అక్టోబర్ 22వ తేదీన విజయదశమి నాడు కొత్త రాజధాని అమరావతి భూమిపూజకు జపాన్ ప్రధాని షింజో ఎబేను ఆహ్వానించనున్నారు.
ఈ నెల ఏడవ తేదీన ఆయన సాఫ్ట్ బ్యాంక్ చైర్మన్‌తో భేటీ కానున్నారు. 8వ తేదీన జపాన్‌లోని ఓ స్మార్ట్ సిటీని సందర్శిస్తారు. జూలై 8న తిరిగి చంద్రబాబు తిరిగి వస్తారు. కాగా, శనివారం ఉదయం ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో ఎర్రచందనం, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ తదితరులపై చర్చిస్తారు.

అంతకుముందు, అనంతపురం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు మాట్లాడుతూ.. పేదవారి ఇంటికి పెద్దకొడుకులా ఉండి కష్టపడతానని చెప్పారు. రైతులు అప్పును తన భుజాల పైన వేసుకొని ముందుకు సాగుతానని చెప్పారు. ఇంతటి ఆర్థిక సంక్షోభంలోను పింఛన్లు రుణమాఫీలు చేస్తున్నామన్నారు.
అనంతపురం జిల్లాలో ప్రతి ఎకరాకు నీరు అందించడమే తన లక్ష్యమన్నారు. లక్ష్యాన్ని సాధించే వరకు మళ్లీ మల్లీ జిల్లా పర్యటనకు వస్తానని చెప్పారు. ఎవరూ చేయని విధంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టామని చంద్రబాబు చెప్పారు.












Click it and Unblock the Notifications