2004-14 ఇలా..: బాబు తెరపై చూపించారు (పిక్చర్స్)
హైదరాబాద్: ప్రత్యేక పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
గురువారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో నిర్వహించిన ఏడు మిషన్లపై వర్క్‌షాప్‌లో చంద్రబాబు మాట్లాడుతూ భవిష్యత్‌లో అభివృద్ధిలో ముందుకెళ్లడానికే యాక్షన్‌ప్లాన్ అని, అందులో భాగంగానే ఏడు మిషన్లపై వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
పదేళ్లుగా అవినీతిపై రాజీలేని పోరాటం చేశామన్నారు. విభజన సమయంలోనూ అనేక అంశాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. తమ ప్రభుత్వం పొలిటికల్ లైన్స్‌లో పని చేస్తుందని చంద్రబాబు చెప్పారు.

చంద్రబాబు
గురువారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో నిర్వహించిన ఏడు మిషన్లపై వర్క్‌షాప్‌లో మాట్లాడే ముందు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తూ..

చంద్రబాబు
పార్టీ - ప్రభుత్వం మధ్య సమన్వయం అవసరమని చంద్రబాబు అన్నారు. పార్టీ కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు సమీక్షలు జరగాలని సూచించారు.

చంద్రబాబు
పార్టీని గ్రామస్థాయి నుంచి సమన్వయం చేయాలని, నాయకుల్లో నైపుణ్యం పెరగాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రతి అంశంపైన స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని నాయకులకు సూచించారు.

చంద్రబాబు
బీసీ,ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. పదేళ్ల తర్వాత గ్రామస్థాయి నుంచి దేశస్థాయి వరకు కొత్త పాలన వచ్చిందని, ప్రతి ఒక్కరు అభివృద్ధిని సీరియస్‌గా తీసుకోవాలన్నారు.

చంద్రబాబు
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే అనేక సంస్కరణలు తీసుకువచ్చిందని చంద్రబాబు అన్నారు. విద్యుత్ ఉత్పత్తిలోనూ అనేక సంస్కరణలు తెచ్చామని ఆయన వెల్లడించారు.

చంద్రబాబు
గురువారం హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో నిర్వహించిన ఏడు మిషన్లపై వర్క్‌షాప్‌లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాళ్లు.

చంద్రబాబు
గత పదేళ్లలో విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోయిందని, పదేళ్లుగా అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ప్రధానిపై సీబీఐ విచారణకు కోర్టు ఆదేశించిందని, మంత్రులు, ఐఏఎస్, పారిశ్రామికవత్తేలు జైలుకెళ్లారన్నారు.

రాష్ట్ర విభజనతో అనేక సమస్యలొచ్చాయన్నారు.
కాంగ్రెస్ తప్పు చేసినందుకే ఏపీలో ఒక్కసీటు గెలవలేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. సుస్థిర ప్రభుత్వాన్ని కోరుతూ ప్రజలు తీర్పునిచ్చారన్నారు.

చంద్రబాబు
దేశంలో ఒక పార్టీకి పూర్తి మెజార్టీ రావడం ఇదే తొలిసారని చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీ రాజధాని ఎక్కడనేది ఇంకా నిర్ణయం కాలేదని ఆయన తెలిపారు. 2004-14 వరకు బ్యాడ్ గవర్నమెంట్ అంటూ స్క్రీన్ పైన చూపిస్తున్న చంద్రబాబు.

చంద్రబాబు
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో సమస్యల పరిష్కారానికి తెలంగాణ సీఎం కేసీఆర్ ముందుకొచ్చారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు.

చంద్రబాబు
గురువారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో నిర్వహించిన ఏడు మిషన్లపై వర్క్‌షాప్‌లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. మిషన్ ఫోర్ గురించి చెబుతూ..

చంద్రబాబు
గురువారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో నిర్వహించిన ఏడు మిషన్లపై వర్క్‌షాప్‌లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. మిషన్ సిక్స్ గురించి చెబుతూ.. మధ్యలో నవ్వుతున్న చంద్రబాబు.

చంద్రబాబు
ఆంధ్ర ప్రదేశ్ ఆర్థికంగా కోలుకునేందుకు కేంద్రం ఉదారంగా సాయం చేయాలని చంద్రబాబు కోరారు. విభజన చట్టంలో ప్రస్తావించిన సంస్థలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

చంద్రబాబు
ఏపీ పరిస్థితి వైకుంఠాపాళిలా ఉందని చంద్రబాబు అన్నారు. పాము కరిస్తే మళ్లీ కిందకే వస్తామని హెచ్చరించారు. ఏపీలో నీరు, విలువైన ఖనిజ సంపద ఉందని పేర్కొన్నారు.

చంద్రబాబు
కృష్ణా-గోదావరి నదులను అనుసందానం చేస్తే 1000 టీఎంసీల నీటిని వాడుకోవచ్చని చంద్రబాబు చెప్పారు. విశాఖ, తూగో, పగో, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు గ్రావిటీ పద్దతిలో నీరివొచ్చన్నారు.












Click it and Unblock the Notifications