మహానాడు బిగ్ సక్సెస్-ఇక కొత్త ఆపరేషన్ -చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!
పాక్ ఉగ్రవాదులను ఏరిపారేసిన ఆపరేషన్ సింధూర్ స్ఫూర్తితో ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్, పాజిటివ్ పాలిటిక్స్, ప్రోగ్రసివ్ పాలిటిక్స్‌కు నాంది పలుకుదామని టీడీపీ అధినేత చంద్రబాబు పిలువునిచ్చారు. కడపలో టీడీపీ మహానాడు ముగింపురోజు ఆయన కీలక ఉపన్యాసం చేశారు. టెర్రరిస్టులు దేశానికి ఎంత ప్రమాదమో రాజకీయ ముసుగులో ఉన్న ఆర్ధిక ఉగ్రవాదులు సమాజానికి అంతకంటే ప్రమాదకరమని, వారిని రాష్ట్రం నుంచి తరమికొడదామన్నారు. భారతదేశం టెర్రిస్టులపై ఆపరేషన్ సింధూర్ చేసినట్లుగానే... ఆర్ధిక ఉగ్రవాదులను 'ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్'తో రాజకీయల్లో లేకుండా చేద్దామన్నారు.
పార్టీ ఎలా ఉండాలో, పాలన ఎలా ఉండాలో చెప్పడంలో టీడీపీ ప్రస్థానం ఒక ఒక కేస్ స్టడీగా.. పాలకులు ఎలా ఉండకూడదో, పార్టీ ఎలా నడపకూడదో వైసీపీ ఒక కేస్ స్టడీగా చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీని అడ్రస్ లేకుండా చేస్తామన్న చంద్రబాబు... టీడీపీ కార్యకర్తల త్యాగం, పోరాటాల ఫలితంగానే ఈ ప్రజాపాలన వచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి మహానాడు..దేవుని గడపలో జరిగింది. రెస్సాన్స్ అదిరిందని, సూపర్ హిట్ అయ్యిందని చంద్రబాబు తెలిపారు.

గత ఏడాది మే 2వ తేదీన ప్రజాగళం ఎన్నికల సభ కోసం కడపకు వచ్చానని, ఆ రోజు సభలో కడప రాజకీయం మారుతోంది, కడప గడపలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని చెప్పానని, అది ఇవాళ అక్షరాలా నిజమైందన్నారు. అభివృద్ది-సంక్షేమం-సంపద సృష్టి నిరంతరం చేస్తూ, మెరుగైన జీవన ప్రమాణాలు అందించే విధానంతో అడుగులు వేస్తున్నామన్నాకు. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ టీడీపీ అన్నారు.
గత ప్రభుత్వం చేసిన దుర్మార్గాలకు, భూ మాఫియాలకు ప్రజలు అల్లాడిపోయారని, తన రాజకీయ జీవితంలో ఈ స్థాయి భూ సమస్యలు ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు తెలిపారు. పేదలను దోచుకునేందుకు 22 Aను అస్త్రంగా చేసుకున్నారని, ఆస్తులను వివాదాల్లోకి నెట్టారని గుర్తుచేశారు. అధికారంలోకి రాగానే ప్రజల భూములకు రక్షణ లేకుండా చేసిన ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు చేశామని, కొత్తగా యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చామని తెలిపారు. రాబోయే మహానాడు కల్లా భూ సమస్యలు పూర్తిగా పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు.

గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతోనే ఢిల్లీలో పరపతి పెరిగిందని, కేంద్ర సాయంతో రాష్ట్రాన్ని అభివృద్ది చేసుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును గాడిన పెట్టామని, 2027 డిసెంబర్ లోగా పోలవరం పూర్తిచేసే బాధ్యత తనదని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ కాపాడామని, రైల్వే జోన్ ఏర్పాటయ్యేలా చూశామని తెలిపారు. అమరావతికి రూ. 15 వేల కోట్లు సమకూర్చేందుకు కేంద్రం సహకరించిందన్నారు. ఇంటింటికీ నీళ్లు అందించాలనేది ప్రధాని మోదీ ఆలోచన అన్నారు.
యువశక్తికి అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేస్తారని తాను బలంగా నమ్ముతానని చంద్రబాబు తెలిపారు. అందుకే ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచే 20 లక్షల ఉద్యోగాల కల్పిస్తామని చెప్పామన్నారు. దాని కోసమే కష్టపడుతున్నానన్నారు. రూ. 7 లక్షల 50 వేల కోట్ల 6 లక్షలమందికి ఉద్యోగాల కోసం పెట్టుబడులు వచ్చాయని, మీ రాష్ట్రంలో భూతం ఉంది. రావాలంటే భయమేస్తోందని కొందరు పారిశ్రామికవేత్తలు అన్నారని, ఆ భూతాన్ని భూ స్థాపితం చేస్తున్నామని భరోసా ఇచ్చానన్నారు. నూతనంగా తీసుకువచ్చిన 20కు పైగా పాలసీలతో ఫలితాలు వస్తున్నాయన్నారు.
శభాష్... కడప.#MahanaduRoars #Mahanadu2025 pic.twitter.com/T6LBFqU31L
— N Chandrababu Naidu (@ncbn) May 29, 2025
రాయలసీమ అంటే రాళ్ల సీమ కాదు, రాయలసీమను రాష్ట్రానికి ఒక మణిహారంగా మారుస్తామన్నారు. రాయల సీమ అభివృద్దికి ప్రధాన అడ్డంకి ఫ్యాక్షనే అని నాడే గుర్తించామని, సీమ గడ్డపై ఫ్యాక్షన్ ఉండకూడదని కఠినంగా వ్యవహరించానన్నారు. రాయల సీమ అభివృద్దికి మన దగ్గర ప్రత్యేక బ్లూప్రింట్ ఉందన్నారు. విద్యాసంస్థలు, ఇరిగేషన్, హార్టికల్చర్, పరిశ్రమలు, గ్రీన్ ఎనర్జీ, టూరిజం, హైవేలు, పారిశ్రామిక కారిడార్లు, ఇండస్ట్రియల్ నోడ్ లతో సీమలో ఏ జిల్లాకు ఏం చెయ్యాలో పక్కా ప్రణాళిక ఉందన్నారు. ఇప్పటికే తిరుపతిలో ఐఐటీ, ఐఐఎస్ఈఆర్, ఇండియన్ కలినరీ ఇనిస్టిట్యూట్, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, కర్నూలు ఉర్దూ యూనివర్సిటీ, ఐఐటీ-డీఎం, అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ, నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ వంటి సంస్థలు తెచ్చామన్నారు.
— N Chandrababu Naidu (@ncbn) May 29, 2025
ఈ మహానాడులో తీర్మానించుకున్న 6 శాసనాలతో నూతనత్వాన్ని, కొత్త నాయకత్వాన్ని తెచ్చామని చంద్రబాబు తెలిపారు. ఈ శాసనాలను తూచా తప్పకుండా అమలుచేసి తిరుగులేని ఫలితాలు సాధిద్దామన్నారు. స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాన్ని సాధించే క్రమంలో ప్రతీ ఏడాది ఏం చేశామో చెపుతామన్నారు. 2029 నాటికి పేదరికం లేని సమాజమే లక్ష్యమన్నారు. ప్రతి ఒక్కరికీ ఇళ్లు కట్టించి , కనీస అవసరాలు తీర్చుతామన్నారు. కార్యకర్తే అధినేత అని మరోసారి చెప్పారు. కార్యక్రమం చివరిలో కోడూరు నుంచి సైకిల్‌పై వచ్చి మహానాడుకు హాజరైన కార్యకర్తను సీఎం సన్మానించారు. ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి విజ్ఞప్తి మేరకు కడపకు తాగునీటి సమస్యను పరిష్కరించడంతో పాటు, బుగ్గవంక చెరువు అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
-
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications