కలత చెందా, అందుకే దీక్ష: చంద్రబాబు, పొన్నం ఆగ్రహం
హైదరాబాద్: కాంగ్రెసు తీరు పైన తాను కలత చెందానని అందుకే ఢిల్లీలో దీక్ష చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం అన్నారు. దీక్ష కోసం ఢిల్లీ బయలుదేరే ముందు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెసు పార్టీ అవలంభిస్తున్న విధానం వల్ల ఒక బాధ్యత కలిగిన పార్టీ అధినేతగా కలత చెందానని చెప్పారు.
తెలుగు జాతి విధ్వంసానికి కాంగ్రెసు పార్టీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. డెబ్బై రోజులుగా ఉద్యమం జరుగుతున్నప్పటికీ కేంద్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కాంగ్రెసు తీరుకు నిరసనగానే దీక్ష చేస్తున్నట్లు చెప్పారు. తన దీక్షకు అందరు సహకరించాలన్నారు. కేంద్రం దిగి వచ్చే వరకు ఉద్యమిస్తామని, తాను చేస్తోంది ధర్మపోరాటమని, న్యాయపోరాటమని చెప్పారు. విభజన పట్ల కేంద్రం తీరు సరిగా లేదన్నారు.

ప్రజల ఇష్టానుసారమే నిర్ణయాలు తీసుకోవాలని, ప్రజాస్వామ్యంలో అందరినీ కలుపుకొని ముందుకు పోవాల్సి ఉందన్నారు. ఢిల్లీలో పెద్దలు ఏది మాట్లాడితే వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు ఇక్కడ అదే మాట్లాడుతారని ఎద్దేవా చేశారు. బ్రిటిష్ వారు దిగి రారనుకుంటే జాతిపిత మహాత్మా గాంధీ దీక్షలు చేసే వారు కాదన్నారు.
సీమాంధ్రలో ప్రజలు స్వచ్చంధంగా ఆందోళన చేస్తున్నారని, అక్కడి ప్రజల ఆవేదన యావత్ దేశానికి తెలియాల్సిన అవసరముందన్నారు. రాష్ట్రంలో కూర్చొని మాట్లాడితే కేంద్రానికి ఇఖ్కడి పరిస్థితి తెలియదని తాను ఢిల్లీలో దీక్ష చేస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీ వెళ్లి రాజ్ ఘాట్ వద్ద మహాత్ముడికి నివాళులు అర్పించి దీక్షను ప్రారంభిస్తానని చెప్పారు.
పొన్నం కౌంటర్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడులు దీక్షల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications