డీజీపీకి చంద్రబాబు లేఖ: వైసీపీ గూండాల దాడులతో ఏపీ ఆటవిక రాజ్యాన్ని తలపిస్తోందని ఆగ్రహం
టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఇప్పటికే ఏపీ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు. కుప్పంలో టీడీపీ కార్యకర్త మురళిపై దాడి చేశారంటూ డీజీపీ గౌతమ్ సవాంగ్ దృష్టికి చంద్రబాబు తీసుకువెళ్లారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయని, ప్రాథమిక హక్కుల పట్ల గౌరవం లేదని, ఏపీ ఆటవిక రాజ్యాన్ని తలపిస్తోందని చంద్రబాబు తాను రాసిన లేఖలో పేర్కొన్నారు.

టీడీపీ కార్యకర్త మురళిపై దాడి ఘటన, విరుచుకుపడిన చంద్రబాబు
చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ కార్యకర్త మురళిపై జరిగిన దాడి ఘటనపై విరుచుకు పడిన చంద్రబాబు వైసీపీ నేతలు తమ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ లేఖలో పేర్కొన్నారు. కుప్పం టిడిపి క్రియాశీల సభ్యుడైన మురళిని డిసెంబర్ 20వ తేదీన మధ్యాహ్నం 2 గంటల సమయంలో వైసీపీ నేతలు కిడ్నాప్ చేశారని డీజీపీ గౌతమ్ సవాంగ్ దృష్టికి తీసుకువెళ్లారు చంద్రబాబు.టిడిపి కార్యకర్త మురళిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన రెస్కో చైర్ పర్సన్ జీఎస్ సెంథిల్ కుమార్ ఇంటికి తీసుకువెళ్లి వైసీపీ గుండాలు అక్రమంగా నిర్బంధించారని, హత్యాయత్నానికి పాల్పడ్డారని చంద్రబాబు తాను రాసిన లేఖలో పేర్కొన్నారు.

మురళిని చిత్రహింసలకు గురి చేశారు, చంపుతామని బెదిరించారు
ఇక అదే రోజు సాయంత్రం అతనిని ఎవరూ లేని ప్రదేశానికి తీసుకువెళ్ళి తీవ్రంగా చిత్రహింసలకు గురి చేశారని, మురళికి కుడికంటి దగ్గర, అతని ముఖం మీద గాయాలయ్యాయని పేర్కొన్నారు. మురళికి ప్రాణ హాని జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని చంద్రబాబు వెల్లడించారు. మురళికి పోలీసులు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. మురళిని కిడ్నాప్ చేసి కొట్టడమే కాకుండా ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే చంపుతామని బెదిరిస్తున్నారని చంద్రబాబు లేఖలో స్పష్టం చేశారు.

మురళికి ప్రాణ హాని కలిగితే ప్రభుత్వానిదే బాధ్యత
చంపుతామని బెదిరించటంతోం మురళి వెంటనే ఎవరికి ఈ విషయం చెప్పలేదని, 23 వ తేదీ సాయంత్రం ఈ విషయం చెప్పారని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. నిందితులను తక్షణమే పోలీసులు అరెస్ట్ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు పై పదేపదే హింసాత్మక దాడుల ఘటనలు జరుగుతున్నప్పటికీ, దోషులపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతలు, గూండాలు ఓ వర్గం పోలీసులతో కుమ్మక్కై ప్రతిపక్ష టీడీపీ నేతల ప్రజాస్వామిక గొంతుకను నొక్కేస్తున్నారు అని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. పోలీసులు సత్వర చర్య తీసుకోవడం ద్వారానే రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించబడతాయని చంద్రబాబు తాను రాసిన లేఖలో పేర్కొన్నారు.

చంద్రబాబు పదేపదే లేఖలు రాస్తున్నా డీజీపీ స్పందన కరువు
ఇప్పటికే రాష్ట్రంలో అనేక సార్లు టీడీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై చంద్రబాబు డీజీపీ గౌతమ్ సవాంగ్ కు అనేకమార్లు లేఖలు రాశారు. రాష్ట్రంలో అరాచకాలు పెట్రేగిపోతున్నాయని, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను నెలకొల్పాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థపై ఉందని గుర్తు చేశారు. చంద్రబాబు ఇప్పటికి ఏపీలో పరిస్థితిపై దృష్టి సారించాలని, తగిన చర్యలు చేపట్టాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాసినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటివరకు చంద్రబాబు రాసిన లేఖలకు డీజీపీ పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications