20న ప్రజలతో చంద్రబాబు లైవ్ చాటింగ్, 16లోగా.. ఇలా
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 20వ తేదీన సాయంత్రం ఆరు గంటలకు సామాజిక అనుసంధాన వేదిక ద్వారా నేరుగా ప్రజలతో మాట్లాడేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకోవడంలో చంద్రబాబు ముందుంటారనే విషయం తెలిసిందే.
ఇప్పుడు అందరి ఆదఱణ పొందుతున్న సామాజిక అనుసంధాన మాధ్యమాల ద్వారా ప్రజలతో మాట్లాడేందుకు ఆయన సిద్ధమయ్యారు. రాష్ట్రాభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేయలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 20న ప్రజలతో లైవ్ చాట్ చేయాలనుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో విద్య, నైపుణ్యల అభివృద్ధి అనే అంశాల పైన ప్రజలతో ఆయన నేరుగా చర్చించేందుకు నిర్ణయించుకున్నారు. తద్వారా ఆయన కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. చంద్రబాబుతో లైవ్ చాట్ చేయాలనుకునే వారు ఈ నెల 16వ తేదీలోగా ఆయా సామాజిక అనుసంధాన వేదికల ద్వారా సలహాలు, సూచనలు, ప్రశ్నలు పంపించాలి.
సామాజిక అనుసంధాన వెబ్ సైట్ల ద్వారా ప్రజలు వాటిని పోస్ట్ చేయాలని ముఖ్యమంత్రి తన ఫేస్‌బుక్ పేజీలో కోరారు. ఆయన విజ్ఞప్తికి సంబంధించిన పోస్టింగు, దృశ్యాలను వివిధ సామాజిక మాధ్యమాల్లో ఇప్పటి వరకు లక్షలాదిమంది చూశారు. వేలాది మంది ఈ లైవ్ చాట్ కోసం నమోదు చేసుకున్నారు.
ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ఖాతాలున్న వారు ఈ చర్చలో పాల్గొనవచ్చు. ఆయా సామాజిక వెబ్ సైట్లలో ఉన్న ఆస్క్ సీబీఎన్ లేదంటే ఆస్క్ ఏపీసీఎం పేజీలలో కానీ, చంద్రబాబు నాయుడు.కామ్ వెబ్ సైట్లలో కానీ విద్య, నైపుణ్యాల అభివృద్ధిపై చర్చక కోసం ప్రశ్నలు, సూచనలు, సలహాలు పోస్ట్ చేయవచ్చు.












Click it and Unblock the Notifications