జగన్ ప్యాలెస్ కు కూతవేటు దూరంలోనే అత్యాచారం .. అన్న కాదు దున్న : చంద్రబాబు, లోకేష్ ధ్వజం
తాడేపల్లి పరిధిలోని సీతానగరం పుష్కర ఘాట్ వద్ద కృష్ణా నది లో ప్రేమజంట పై జరిగిన అఘాయిత్యం పై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిప్పులు చెరుగుతున్నారు.

దిశా చట్టంతో ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని చంద్రబాబు డిమాండ్
రాష్ట్రంలో దిశా చట్టంతో ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇక డీజీపీ గౌతమ్ సవాంగ్ కి లేఖ రాసిన చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ నివాసానికి రెండు కిలోమీటర్ల దూరంలో, డీజీపీ కార్యాలయం, రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో సీతానగరం పుష్కర ఘాట్ వద్ద యువతిపై అత్యాచార దుర్ఘటన జరగడం అమానుషమని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో దిశా చట్టం తీసుకు వచ్చామని చెబుతున్న జగన్ దిశ చట్టం ద్వారా ఇప్పటివరకు ఏం చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఘటన జరిగి ఇన్ని గంటలైనా చర్యలేవి : చంద్రబాబు
మహిళలకు దిశా చట్టంతో ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు చంద్రబాబు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రస్తుతం ఉన్న చట్టాలను సక్రమంగా అమలు చేస్తే సరిపోతాయన్నారు. అత్యాచార ఘటన జరిగి ఎన్ని గంటలు అవుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని చంద్రబాబు, ప్రజల విశ్వాసం పెంచేలా కృష్ణా నది ఒడ్డున పోలీస్ గస్తీ పెంచాలని, రాష్ట్రవ్యాప్తంగా మహిళల రక్షణ కోసం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ప్రచార ఆర్భాటాలకేనా అన్నీ : చంద్రబాబు
రాష్ట్రంలో మహిళలకు రియల్ టైంలో భద్రత కల్పించాలన్న చంద్రబాబు కేవలం ప్రచార ఆర్భాటాలు కోసం మాత్రమే దిశా పోలీస్ స్టేషన్ లు , దిశా మొబైల్ వాహనాలు, ప్రత్యేక యాప్లు ,దిశ చట్టం పనికొచ్చాయని పేర్కొన్నారు. ఇదే సమయంలో నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు తాడేపల్లి సమీపంలో ప్రియుణ్ణి తాళ్లతో కట్టేసి ప్రియురాలిపై సామూహిక అత్యాచారం చేశారని వార్తా పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్ ని పోస్ట్ చేసిన లోకేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఓ అమ్మాయికి ఇంత అన్యాయం జరిగితే ఏమయ్యారు?.. : లోకేష్
జనం తిరగబడతారనే భయంతో రెండేళ్లుగా తాడేపల్లి ప్యాలెస్లో హోమ్ ఐసోలేషన్ అయిన సీఎం జగన్ రెడ్డి గారు మీ ప్యాలెస్ కు కూతవేటు దూరంలో ఒక యువతిని దుండగులు అత్యంత దారుణంగా అత్యాచారం చేశారని సమాచారం అయినా మీకు తెలుసా అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టే పోలీసులు ఓ అమ్మాయికి ఇంత అన్యాయం జరిగితే ఏమయ్యారు అంటూ నిలదీశారు. సొంత చెల్లెళ్ళకి న్యాయం చేయలేని వాడు అన్న కాదు దున్న అంటూ పరుషంగా మాట్లాడారు.
Recommended Video

గన్ కంటే ముందు వస్తాడు జగన్ అంటూ పంచ్ డైలాగ్ లు : లోకేష్ ఎద్దేవా
ఆడపిల్లకు అన్యాయం జరిగితే గన్ కంటే ముందు వస్తాడు జగన్ అంటూ పంచ్ డైలాగ్ లు వేశారని పేర్కొన్న నారా లోకేష్ ముఖ్యమంత్రి ఇంటి దగ్గర ఇంత అన్యాయం జరిగితే ఏడమ్మా జగన్ అంటూ ఎద్దేవా చేశారు. అమరావతి ఉద్యమానికి భయపడి వేల మంది పోలీసులు కాపలా పెట్టుకున్న పిరికిపంద జగన్ పాలనలో మహిళా భద్రత ప్రశ్నార్థకమైంది అంటూ నిప్పులు చెరిగారు నారా లోకేష్.
-
షాకింగ్ : పెళ్లిపై ఏపీ యువత అనాసక్తి .. గణాంకాలు ఏం చెప్తున్నాయంటే -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
తిరుమలలో చంద్రబాబు కుటుంబం- క్యూలైన్ ద్వారా దర్శనం, భక్తులతో కలిసి అన్నప్రసాదం -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!











Click it and Unblock the Notifications