బాబును 'లైట్' తీసుకుంటున్న మోడీ?: కొంప మునుగుతుందా!, అసలేం జరుగుతోంది..
అటు నితీష్, ఇటు కేసీఆర్ లు బీజేపీకి మరింత దగ్గరవడంతో.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ఎన్డీయేలో ప్రాధాన్యం తగ్గిపోతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
న్యూఢిల్లీ: వచ్చే 2019ఎన్నికల్లో మోడీకి ప్రత్యామ్నాయంగా ఉంటాడనుకున్న నితీష్ కుమార్ ఎన్డీయే పంచెన చేరిపోవడం దేశ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేయనుంది. ఈ దెబ్బతో బీహార్‌ను కూడా తన గుప్పిట్లో పెట్టుకున్న ఎన్డీయే మరింత శక్తివంతంగా అవతరించింది.
బీహార్ మహకూటమిని చూపించి దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేద్దామనుకున్న కాంగ్రెస్ కలలు బీటలు వారిపోయాయి. ఎన్డీయేకు ఉన్న బలం రీత్యా.. బయటి పార్టీలు కూడా సఖ్యతతో మెలగాల్సిన అనివార్యత ఏర్పడింది. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్.. తొలి నుంచి బీజేపీతో మిత్రపక్షం తరహాలోనే వ్యవహరిస్తున్నారు.

బాబుకు ప్రాధాన్యం తగ్గుతుందా?:
అటు నితీష్, ఇటు కేసీఆర్ లు బీజేపీకి మరింత దగ్గరవడంతో.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ఎన్డీయేలో ప్రాధాన్యం తగ్గిపోతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదీగాక, ఇటీవలి కాలంలో వైసీపీ అధినేత జగన్ కు మోడీ అపాయింట్ మెంట్ ఇవ్వడం, టీడీపీతో తెగదెంపులు చేసుకుందామంటూ ఏపీ బీజేపీ నేతలు బాహాటంగానే కుండ బద్దలు కొట్టడం.. కలహాల కాపురంపై నీలి నీడలు కమ్ముకునేలా చేశాయి.
Recommended Video


వాళ్లనెందుకు కలవలేదు?:
తాజా ఢిల్లీ పరిణామాలను గమనిస్తే.. కేంద్రంతో చంద్రబాబుకు గ్యాప్ పెరుగుతుందన్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం కోసం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు.. ఆ పని పూర్తవగానే హోంమంత్రిని మినహా మరెవరిని కలవకుండా వెనుదిరిగారు. రాష్ట్రానికి సంబంధించి ఎన్నో సమస్యలు కేంద్రం వద్ద అపరిష్కృతంగా ఉన్నా.. ఆయన మాత్రం వాటి గురించి ఎవరిని సంప్రదించే ఆలోచన చేయలేదు.
కనీసం ప్రధానితో అపాయింట్ మెంట్ కోసమైనా ప్రయత్నించలేదు. మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం ఢిల్లీలోనే మకాం వేసి.. రాష్ట్రానికి అందాల్సిన నిధులు, ఇతరత్రా విషయాలపై అటు మోడీ, ఇటు ఆర్థికమంత్రి జైట్లీతో సంప్రదింపులు జరిపారు.

బాబుతో దోస్తీ అవసరమా?
నితీష్ స్నేహ హస్తంతో మరింత బలపడ్డ బీజేపీకి ఇప్పుడు చంద్రబాబుతో దోస్తీ అంతగా అవసరం లేదనేది కాదనలేని వాస్తవం. ఇలాంటి తరుణంలో చంద్రబాబు కూడా బీజేపీతో డిస్టెన్స్ మెయింటెయిన్ చేస్తే అది టీడీపీకి నష్టమే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో టీడీపీతో దోస్తీని బీజేపీ వదులుకోవచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
బీహార్ పరిణమాలను గమనిస్తే ఈ విషయం అర్థమవుతుందంటున్నారు పరిశీలకులు. నిజానికి బీహార్ లో నితీష్ బీజేపీతో జతకట్టడం ప్రీ-ప్లాన్డ్ వ్యవహారంగానే కనిపిస్తోంది. మోడీతో నితీష్ భేటీ జరిగినప్పుడే దీనికి బీజం పడినట్లు అర్థమవుతోంది. నితీష్ తన సీఎం పదవికి రాజీనామా చేయడమే ఆలస్యం.. 'నితీశ్ కుమార్ రాజీనామా అవినీతి వ్యతిరేక పోరాటంలో భాగమవుతుంది' అంటూ మోడీ ట్వీట్ చేయడం దీనికి బలాన్ని చేకూర్చింది.

అవినీతి ఆరోపణలు ముంచుతాయా?:
ఇక ఏపీలో పరిస్థితులను గమనిస్తే.. అమరావతి నిర్మాణంలోను, ప్రభుత్వ శాఖల్లోను తీవ్ర అవినీతి చోటు చేసుకుంటుందని ప్రతిపక్ష వైసీపీ ముందు నుంచి కేంద్రానికి నివేదికలు పంపుతూనే ఉంది. ప్రధాని నుంచి రాష్ట్రపతి దాకా ఆ నివేదికలు అందాయి. ఇక అమరావతి చుట్టూ టీడీపీ నేతల భూబాగోతాలపై కూడా జగన్&కో కేంద్రానికి డాక్యుమెంట్స్ పంపించింది.
ఇటు మిత్రపక్షం బీజేపీలో చంద్రబాబు వ్యతిరేక వర్గం కూడా టీడీపీ అవినీతిపై కేంద్రానికి నివేదికలు పంపుతూనే ఉంది. ముఖ్యంగా వైజాగ్ భూకుంభకోణంపై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పెద్ద రిపోర్టే పంపించారట. ఇటీవలే ఏపీలో పర్యటించిన అమిత్ షా సైతం టీడీపీ అవినీతికి సంబంధించి బీజేపీ నేతలు ఇచ్చిన రిపోర్టులను మోడీ వద్దకు తీసుకెళ్లారట. మొత్తం మీద ఈ పరిస్థితులన్ని చూస్తే.. చంద్రబాబును బీజేపీ 'లైట్' తీసుకునే అవకాశం లేకపోలేదంటున్నారు విశ్లేషకులు.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ!












Click it and Unblock the Notifications