గైర్హాజరీకి జగన్ కారణం: చంద్రబాబు పరోక్ష విసుర్లు

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వైఖరిపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడడు సునిశిత విమర్శలు చేశారు. చంద్రబాబు అనవసర హంగామా చేస్తున్నారంటూ ఎద్దేవా చేసిన వారికి పథకాల ఆచరణతో సమాధానం చెబుతామని జగన్ పేరు ప్రస్తావించకుండా చంద్రబాబు వ్యాఖ్యానించారు.

రాష్ట్ర విభజనను ఇష్టానుసారం చేసిన కాంగ్రెస్‌కు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని, ఆ పార్టీ కోలుకోవడానికి మరో 20 ఏళ్ళు పడుతుందన్నారు. రాష్ట్ర ప్రజలకు తాను రుణపడి ఉంటానని పదేపదే చెప్పారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వైయస్ జగన్ హాజరు కాలేదు. హాజరు కాకపోవడానికి ఆయన కారణం చెప్పారు.

Chandrababu make comment against Jagan

ఆంధ్రప్రదేశ్ తీవ్రమైన సంక్షోభంలో ఉన్న స్థితిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హంగామా చేయడాన్ని వ్యతిరేకిస్తూ తాను వెళ్లడం లేదని చెప్పారు. రాజధాని నిర్మాణానికి చంద్రబాబు ఓ వైపు ప్రజల నుంచి విరాళాలు కోరుతూ మరోవైపు ప్రమాణ స్వీకారానికి ఆడంబరం కోసం 30 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని ఆయన విమర్శిచారు

అంత ఖర్చు పెట్టడాన్ని చంద్రబాబు విజ్ఞతకే వదిలేస్తున్నానని, అటువంటి వృధా ఖర్చుకు వ్యక్తిగతంగా తాను వ్యతిరేకమని ఆయన రాజమండ్రిలో మీడియా ప్రతినిధులతో అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+