కుప్పం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోడీ పాలన అవసరం, ఐనా: చంద్రబాబు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఒకపక్క తెలంగాణకు, మరోపక్క ఆంధ్రప్రదేశ్‌కు దక్కాల్సిన ప్రయోజనాలపై ఎలాంటి రాజీ పడవద్దని, ఈ విషయంలో ఎప్పటికపుడు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పార్టీ ఎంపీలకు సూచించారు. లేక్‌వ్యూ అతిథి గృహంలో ఆయన పార్లమెంటరీ పార్టీ నేతలతో సమావేశమయ్యారు.

మరోపక్క మంత్రులతోనూ, అధికారులతోనూ వేర్వేరుగా సమావేశమైన చంద్రబాబునాయుడు ఇంకో పక్క కుప్పం నుండి, పులివెందుల నుండి వేర్వేరుగా వచ్చిన రైతు బృందాలతో మంతనాలు సాగించారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 వరకూ బిజీబిజీగా గడిపేసిన చంద్రబాబు మధ్యలో నార్త్ అమెరికా నుండి వచ్చిన డాక్టర్ బి అశోక్‌ను కలిశారు.

రేషన్ డీలర్ల డైరీని ఆవిష్కరించారు. ఇంకో పక్క పంటలకు నీటి సమస్యపై అధికారులను ఆరా తీసిన చంద్రబాబు విద్యాశాఖ పనితీరును సమీక్షించారు. మధ్యలో జానపదకళాకారులు వస్తే వారిని కూడా కలిశారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన విధానంపై ఎంపిలతో చంద్రబాబు విస్తృతంగా చర్చించి దిశానిర్దేశం చేశారు.

కేంద్రంలో మిత్రపక్షంగా ఉన్నామని, మనకు రావల్సిన ప్రయోజనాలకు కేంద్రంపై వత్తిడి తీసుకురావాలే తప్ప నోరు జారవద్దని, పార్లమెంటరీ సంప్రదాయాలను ఉల్లంఘించవద్దని చంద్రబాబు సూచించారు. చర్చల్లో పాల్గొంటూ, కేంద్ర మంత్రులను కలిసి చర్చిస్తూ విభజన చట్టంలోని హామీలను సాధించేందుకు కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రాలకు రావల్సిన నిధులు రాబట్టడంలో ఎంపిల పాత్ర చాలా కీలకమైనదన్నారు. 30 ఏళ్ల తర్వాత దేశంలో సుస్థిర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ తెచ్చారని, మోడీ పాలన దేశానికి చాలా అవసరమన్నారు. రాష్ట్రాల ప్రయోజనాలతో పాటు వివిధ అంశాలను ప్రస్తావించినపుడు మనం దేశ ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకోవల్సిన అవసరం ఉందన్నారు.

చంద్రబాబు, దత్తాత్రేయ

చంద్రబాబు, దత్తాత్రేయ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును శనివారం కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం ఇస్తున్న దృశ్యం.

చంద్రబాబు

చంద్రబాబు

ఒకపక్క తెలంగాణకు, మరోపక్క ఆంధ్రప్రదేశ్‌కు దక్కాల్సిన ప్రయోజనాలపై ఎలాంటి రాజీ పడవద్దని, ఈ విషయంలో ఎప్పటికపుడు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పార్టీ ఎంపీలకు సూచించారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఒకపక్క తెలంగాణకు, మరోపక్క ఆంధ్రప్రదేశ్‌కు దక్కాల్సిన ప్రయోజనాలపై ఎలాంటి రాజీ పడవద్దని, ఈ విషయంలో ఎప్పటికపుడు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పార్టీ ఎంపీలకు సూచించారు. లేక్‌వ్యూ అతిథి గృహంలో ఆయన పార్లమెంటరీ పార్టీ నేతలతో సమావేశమయ్యారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం బిజీబిజీగా గడిపారు. పార్టీ ఎంపీలతో, కేంద్రమంత్రి, రాష్ట్ర మంత్రులతో, అధికారులతో భేటీ అయ్యారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం నాడు నార్త్ అమెరికా నుండి వచ్చిన డాక్టర్ బి అశోక్‌ను కలిశారు.

చంద్రబాబు

చంద్రబాబు

లేక్ వ్యూ అతిథి గృహంలో తనకు కృతజ్ఞతలు తెలపటానికి శనివారం కడప జిల్లా పులివెందుల నుంచి వచ్చిన వందలాది మంది రైతులతో చంద్రబాబు మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాల్వ గట్ల పైన నిద్రించి అయిన నీటిని ఇస్తానని హామీ ఇచ్చారు.

English summary
AP CM Chandrababu Naidu MEETING PARLIMENTARY MEMBERS
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X