గవర్నర్‌తో చంద్రబాబు భేటీ: కేంద్ర సహకారం, కీలక అంశాలపై చర్చ, మంత్రి వర్గ విస్తరణ?
విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం నగరంలోని గేట్‌వే హోటల్‌లో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.

కేంద్రం సహకారం లేక రాష్ట్రం నష్టపోతున్న తీరును సీఎం చంద్రబాబు వివరించారు. రాష్ట్రానికి న్యాయం చేసే విషయంలో కీలకంగా వ్యవహరించాలని గవర్నర్‌ను కోరినట్లు సమాచారం. గంటన్నరకు పైగా గవర్నర్‌తో చంద్రబాబు భేటీ కొనసాగుతోంది.
Recommended Video

పార్టీ కార్యాలయానికి ప్రతి మంత్రి అందుబాటులో ఉండాలి: చంద్రబాబు
కాగా, రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు గవర్నర్‌తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.












Click it and Unblock the Notifications