అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రెండూ కావాలి!: మోడీతో బాబు, విభజన సమస్యపై రాజ్, పవన్‌ని గౌరవిస్తాం: చినరాజప్ప

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయం పదిన్నర గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. అంతకుముందు ప్రధాని కార్యాలయంలోనే కేంద్రమంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమయ్యారు.

అనంతరం జైట్లీ, మోడీ, చంద్రబాబులు సమావేశమయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ విషయమై వారు చర్చిస్తున్నారని తెలుస్తోంది. హోదానా లేక ప్యాకేజీయా, విభజన చట్టంలోని హామీలు నెరవేర్చడంలో ఆలస్యం.. తదితర అంశాలపై చంద్రబాబు ప్రధాని మోడీతో చర్చిస్తున్నారని సమాచారం.

ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు ఆర్థిక ప్యాకేజీ కూడా ఇవ్వాలని చంద్రబాబు.. మోడీని కోరనున్నారని తెలుస్తోంది. నిధుల విషయంలో తాత్సారం చేయవద్దని కోరనున్నారు.

ఏపీ, తెలంగాణల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: వెంకయ్య

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. చంద్రబాబుతో భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. విభజన చట్టం అమలయ్యేలా చూడాలని కేంద్ర హోంమంత్రిని కోరామని చెప్పారు.

తెలుగువాడిగా రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూస్తానని చెప్పారు. అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని కేంద్ర హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారన్నారు. విభజన బిల్లులో ఏపీకి అన్యాయం జరిగిందన్నారు.

ఆర్థిక పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగు అవుతోందన్నారు. పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలు ప్రత్యేక హోదాను అడుగుతున్నాయని, వాటిని దృష్టిలో పెట్టుకోని తాము ముందుకు వెళ్లవలసి ఉంటుందని చెప్పారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి తమకు అప్పగించిందని గుర్తు చేశారు. ప్రధాని మోడీ ఆర్థిక వ్యవస్థను గాఢిన పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, గాఢిన పడుతోందన్నారు.

Chandrababu meets Modi today, press for Special Category Status

విభజన సమస్యల పరిష్కారానికి మార్గాలు చూపిస్తాం: రాజ్‌నాథ్

విభజన సమస్యల పరిష్కారానికి తాము మార్గాలు చూపిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు.

పవన్ కళ్యాణ్‌ను గౌరవిస్తాం: చినరాజప్ప

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను టిడిపి ఎప్పటికీ గౌరవిస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప మంగళవారం అన్నారు. పవన్ కళ్యాణ్‌తో తమ పార్టీ సత్సంబంధాలనే కోరుకుంటుందన్నారు. నవ్యాంధ్ర రాజధాని కోసం ఏపీ ప్రభుత్వం జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్ పైన పవన్ కల్యాణ్ ఘాటు ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే.

ఈ ట్వీట్లపై ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సహా పలువురు మంత్రులు అంతే ఘాటుగా స్పందించారు. వీరిపై మొన్నటి పెనుమాక పర్యటనలో పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చినరాజప్ప పైవిధంగా స్పందించారు.

English summary
AP CM Chandrababu has met PM Modi today, press for Special Category Status.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X