తగవు తీర్చండి, తెలంగాణదే ఆలస్యం: చంద్రబాబు

చంఢీగఢ్/న్యూఢిల్లీ: విభజన జరిగి ఏడాది కావొస్తుందని, సమస్యలు పరిష్కరించాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కేంద్రమంత్రులకు మంగళవారం విజ్ఞప్తి చేశారు. అలాగే, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న తగవు తీర్చాలని కేంద్రాన్ని కోరారు. తాను చర్చించేందుకు సిద్ధమని చెప్పారు.

జూన్‌ రెండో తేదీకి రాష్ట్రం ఏర్పడి ఏడాది పూర్తవుతోందని, ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించాలని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలని రాజ్‌నాథ్‌ సింగ్‌ను కోరానని తెలిపారు.

వీలైనంత త్వరలో ఒక సమావేశం ఏర్పాటు చేసి, సమీక్ష చేసి అన్ని సమస్యలూ పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఆంధ్రా, తెలంగాణల్లో ఎవ్వరికీ నష్టం జరగకుండా, ఇద్దరికీ మేలు జరిగేలా సమస్యలు పరిష్కరించుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, తెలంగాణ కూడా ముందుకు రావాలని చంద్రబాబు కోరారు.

Chandrababu meets Rajnath, discusses special status for Andhra

ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, ఉపరితల రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీలతో భేటీ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కి నిధులు, ప్రాజెక్టుల మంజూరులో సహాయం మరింతగా పెంచాలని కోరానన్నారు.

విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలు, ప్రత్యేక హోదా, వెనకబడిన ప్రాంతాలకు ప్యాకేజీ, పారిశ్రామిక రాయితీలు, రాజధాని నిర్మాణానికి ఆర్థిక సహాయం, రెవెన్యూ లోటు భర్తీ అంశాలపై జైట్లీతో చర్చించానన్నారు. మహానది, గోదావరి నదులను పోలవరం వద్ద అనుసంధానించడానికి ఒడిశా ప్రభుత్వం అంగీకరించిందని, తద్వారా, రాబోయే రోజుల్లో బ్రహ్మపుత్ర-మహానది-గోదావరి నదుల అనుసంధానం జరుగుతుందన్నారు.

Chandrababu meets Rajnath, discusses special status for Andhra

ఉత్తరాది నుంచి దక్షిణాదికి జరిగే నదుల అనుసంధానంలో పోలవరం ప్రాజెక్టుకు చాలా ప్రాధాన్యం ఉంటుందన్నారు. అందుకే ఈ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కోరానన్నారు. ఏపీలో రోడ్లు, రైలుమార్గాల అనుసంధానంపై గడ్కరీతో చర్చించానన్నారు.

రాజధాని నుంచి కర్నూలు-అనంతపురానికి ఆరులైన్ల జాతీయ రహదారి నిర్మాణం, విశాఖ, విజయవాడలకు బైపాస్‌ రోడ్ల నిర్మాణం త్వరగా చేయాలని కోరామన్నారు. రాజధాని నిర్మాణానికి శంకుస్థాపనకు మంచిరోజు కోసం చూస్తున్నామని, మంచిరోజులు లేని నేపథ్యంలో ఈలోపే భూమిపూజ చేస్తున్నామన్నారు. పని ప్రారంభించే టప్పుడు ప్రధానితో శంకుస్థాపన జరుపుతామన్నారు. చంద్రబాబు నితి అయోగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+