Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పొత్తులపై చంద్రబాబు కీలక నిర్ణయం - జనసేన తో మైత్రి వేళ అనూహ్యంగా..!?

టీడీపీ చంద్రబాబు పొత్తుల దిశగా కీలక ప్రకటనకు సిద్దం అవుతున్నారు.

టీడీపీ చంద్రబాబు పొత్తుల దిశగా కీలక ప్రకటనకు సిద్దం అవుతున్నారు. అటు జనసేన - టీడీపీ పొత్తు ఖాయంగా భావిస్తున్న వేళ చంద్రబాబు నిర్ణయం ఆసక్తి కరంగా మారుతోంది. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనేది చంద్రబాబు వ్యూహం. అందులో భాగంగా జనసేనతో .. కలిసి వస్తే బీజేపీతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు.

ప్రస్తుతం జరుగుతన్న ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకం గా మారాయి, సెమీ ఫైనల్స్ గా ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కీలక ప్రకటనకు సిద్దం అవుతున్నారు.

వామపక్షాలతో టీడీపీ పొత్తు..!

వామపక్షాలతో టీడీపీ పొత్తు..!

మరోసారి టీడీపీ- వామపక్షాల పొత్తు దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఈ పొత్తు కనిపిస్తున్నా..భవిష్యత్ ప్రయోజనాల దిశగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టం అవుతోంది. ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీని ఓడించటమే లక్ష్యంగా చంద్రబాబు కీలక మంతనాలు ప్రారంభించారు.

వామపక్ష పార్టీలు -టీడీపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరస్పర సహకారం పైన చర్చలు సాగుతున్నాయి. సానుకూల నిర్ణయం దిశగా రంగం సిద్దమైంది. ఈ రోజు లేదా రేపు ఈ పొత్తుపైన అధికారిక ప్రకటన ఖాయంగా కనిపిస్తోంది. మూడు పట్టభద్ర స్థానాలు, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పదవులకు ఈ నెల 23న పోలింగ్‌ జరుగనుంది.

ఇందులో టీడీపీ మూడు పట్టభద్ర స్థానాలకు బరిలోకి దిగింది. ఉపాధ్యాయ స్థానాలకు మాత్రం పోటీ చేయడం లేదు. ఇదే సమయంలో వైసీపీ మద్దతుతో అభ్యర్ధులు రంగంలో ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీ ఫైనల్స్ గా భావిస్తున్న వేళ ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి.

పరస్పర సహకారం పై ఒప్పందం

పరస్పర సహకారం పై ఒప్పందం

టీడీపీ పట్టభద్రుల స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తోంది. వైసీపీ మొత్తం పట్టభద్ర, ఉపాధ్యాయ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఆ పార్టీ అభ్యర్థులు ఎక్కడా గెలవకుండా చేసేందుకు పరస్పరం సహకరించుకోవడానికి టీడీపీ, వామపక్షాలు ప్రయత్నిస్తున్నాయి.కమ్యూనిస్టు పార్టీలకు అనుబంధంగా ఉన్న ఉపాధ్యాయ సంఘాలు పీడీఎఫ్‌ కూటమిగా ఏర్పడి పట్టభద్ర, ఉపాధ్యాయ స్థానాలన్నింటిలోనూ పోటీ చేస్తున్నాయి.

వామపక్ష భావజాలానికి దగ్గరగా ఉండే మరో ఉపాధ్యాయ సంఘం ఏపీటీఎఫ్‌ విడిగా ఉపాధ్యాయ స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తోంది. దీంతో..ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ ప్రాధాన్యత క్రమంలో జరుగుతుంది. ఓట్ల లెక్కింపులోనూ ఈ ప్రాధాన్యత క్రమమే గెలుపును ఖరారు చేస్తుంది. దీంతో..వైసీపీ అభ్యర్ధులు గెలవకుంగా చూడాలనేది చంద్రబాబు వ్యూహం. ఇందు కోసం పట్టభద్ర స్థానాల్లో రెండో ప్రాధాన్య ఓట్లు పరస్పరం వేసుకుందామని, దీనికి బదులుగా ఉపాధ్యాయ స్థానాల్లో తమకు మద్దతివ్వాలని వామపక్షాలు టీడీపీని కోరినట్లు సమాచారం.

రాయలసీమ తూర్పు నియోజకవర్గంలో పీడీఎఫ్‌, ఏపీటీఎఫ్‌ అభ్యర్థులు ఇద్దరూ పోటీపడుతుండడంతో అక్కడ మద్దతుపై నిర్ణయం తీసుకున్న తరువాత..పొత్తుపై అధికారికంగా ప్రకటన చేయనున్నారు.

అటు జనసేన..ఇటు వామపక్షాలు

అటు జనసేన..ఇటు వామపక్షాలు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పోటీలో లేదు. ఎవరికి మద్దతో స్పష్టత ఇవ్వలేదు. వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేయాలని పిలుపు ఇచ్చింది. ఈ సమయంలో ఆ పార్టీ ఓటర్లనూ కలుపుకొని పనిచేయాలని నేతలను టీడీపీ ఆదేశించింది. దీని ద్వారా 2024 ఎన్నికలకు సంబంధించి పొత్తుల లెక్కలు ఎమ్మెల్సీ ఎన్నికల నుంచే ప్రారంభం అవుతున్నాయి.

ఈ పొత్తులు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తున్నా అధికారికంగా ప్రకటించ లేదు. బీజేపీ అధికారిక నిర్ణయం కోసం టీడీపీ -జనసేన వేచి చూస్తున్నాయి. ఇక, బీజేపీ కలిసొచ్చే అవకాశం లేదనే అంచనాకు టీడీపీ వచ్చినట్లు స్పష్టం అవుతోంది.

ఈ క్రమంలో ముందుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ-వామపక్షాలు పరోక్షంగా జనసేన పొత్తుతో వైసీపీ పైన ఎటువంటి ప్రభావం చూపిస్తుందో ఫలితాల్లో స్పష్టత వచ్చిన తరువాత 2024 ఎన్నికల పొత్తుల పైన అధికారంగా ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+