వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శరణమా! సమరమా: జగన్‌పై అచ్చెన్న ఫైర్, ఉద్యోగం ఊడుతుందన్న బాబు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమైనప్పటి నుంచి వాయిదాలు పడుతూ సాగుతోంది. పలుమార్లు వాయిదా పడి ప్రారంభమైన తర్వాత మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ..

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమైనప్పటి నుంచి వాయిదాలు పడుతూ సాగుతోంది. పలుమార్లు వాయిదా పడి ప్రారంభమైన తర్వాత మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. మంత్రి పుల్లారావుపై ప్రతిపక్ష నేత జగన్ ఆరోపణలు చేశారు, జూడీషియల్ ఎంక్వైరీకి ఆదేశించాలని కోరారని గుర్తు చేశారు.

మంత్రి పుల్లారావు సవాలును స్వీకరించి జూడీషియల్ ఎంక్వైరీకి అంగీకరించాలి లేదా క్షమాపణలు చెప్పాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. విచారణలో అన్ని తేలుతాయని అన్నారు. లేదంటే ఆరోపణలు అవాస్తవమని ఒప్పుకుని జగన్ లెంపలేసుకోవాలని అన్నారు.

ఇది మంత్రి గౌరవానికి సంబంధించిన విషయమని అన్నారు. జూడీషియల్ ఎంక్వైరీకి అంగీకరించినా.. జగన్ పిరికిపందలా బయటికివెళ్లిపోయారని అన్నారు. సమయం లేదు మిత్రమా.. శరణమా.. సమరమో ఏదో ఒకటి చెప్పండి అని డిమాండ్ చేశారు. లేదంటే సవాలును ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలన్నారు. విచారణకు ఒప్పుకోకుంటే జగన్ లెంపలేసుకోవాలని అన్నారు. విచారణకు అంగీకరిస్తున్నారా? లేదా? అని మంత్రి యనమల రామకృష్ణుడు.. వైయస్ జగన్మోహన్ రెడ్డిని నిలదీశారు.

chandrababu naidu and achchennaidu fires at YS Jagan

పల్లె రఘునాథ రెడ్డి

అవాస్తవాలను పత్రిక, ఛానల్ ద్వారా ప్రచారం చేస్తున్నారని మంత్రి పల్లు రఘునాథ రెడ్డి ఆరోపించారు. మంత్రి పుల్లారావు సవాలును స్వీకరించాలని అన్నారు. సవాలును స్వీకరించకుంటే మేమైతే రాజీనామా చేసేవాళ్లమని అన్నారు. చేతగానివాడిలా జగన్ ఉండిపోతున్నారని అన్నారు.

ఉద్యోగం ఊడుతుందనే భయం: చంద్రబాబు

జగన్ కు సభ మీద గౌరవం లేదని చంద్రబాబు అన్నారు. పుల్లారావుపై పదే పదే జగన్ ఆరోపణలు చేశారని అన్నారు. గుడ్డకాల్చి మీద పడేయడం సరికాదన్నారు. పుల్లారావు తప్పుచేయలేదని చెప్పినా.. ఆరోపణలు చేశారని మండిపడ్డారు. జగన్ జూడీషియల్ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తే.. తాను అంగీకరించానని చంద్రబాబు చెప్పారు.

పుల్లారావుపై ఆరోపణలు రుజువైతే మంత్రి సభలో ఉండరని, లేదంటే జగన్మోహన్ రెడ్డిని సభ నుంచి బహిష్కరిస్తామని అన్నారు. ఇద్దరిలో ఒకరే సభలో ఉండాలని అన్నారు. జగన్ తన ఉద్యోగం ఊడిపోతుందని భయపడుతున్నారని చంద్రబాబు అన్నారు. సభలో ఇష్టవచ్చినట్లు వ్యవహరించడం కుదరదని చంద్రబాబు స్పష్టం చేశారు.

పీతల సుజాత
రాయలసీమలో పుట్టింటి ఉంటే.. జగన్ సవాల్ స్వీకరించాలని మంత్రి పీతల సుజాత అన్నారు. దమ్ముంటే సవాల్ స్వీకరించాలని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.

సవాళ్లు సాంప్రదాయమేనా?

సభలో సవాళ్లు, ప్రతి సవాళ్లు సాంప్రదాయంలో ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఉంటే రూలింగ్ ఇవ్వాలని స్పీకర్ ను కోరారు. అయితే, నిబంధనల ప్రకారం రూలింగ్ ఇవ్వడం సాధ్యం కాదని అన్నారు స్పీకర్.

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu and Minister Atchannaidu on Friday fired at YSR Congress Party president YS Jaganmohan Reddy for his allegation on Agri gold case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X