తెలంగాణకు తొలి పతకం: సంతోషంగా ఉందన్న చంద్రబాబు (ఫోటోలు)

విశాఖపట్నం: ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్- 2017 పోటీలను విశాఖ వేదికగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. విశాఖలో జరుగుతున్న 13వ జాతీయ అంతర్‌ జిల్లా జూనియర్‌ అథ్లెటిక్స్‌ మీట్‌ను పోర్టు స్టేడియంలో శనివారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం గర్వించతగ్గ రీతిలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాపోటీలను నిర్వహించి సత్తా చాటుతామన్నారు. ఒలింపిక్ గేమ్స్ నిర్వహించాలన్నది తన కలగా చెబుతూ, అందుకు అనుగుణంగా రాష్ట్ర నూతన రాజధాని అమరావతిని తీర్చిదిద్దనున్నట్టు ఆయన వెల్లడించారు.

గత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో నిర్వహించిన కామన్‌వెల్త్ పోటీల్లో అంతులేని అవినీతి చోటుచేసుకోవడంతో ప్రపంచ దేశాల ముందు భారత్ పరువు పోయిందన్నారు. అంతర్జాతీయ స్థాయి క్రీడాపోటీల నిర్వహణ సామర్థ్యం భారత్‌కు లేదన్న నిర్ణయానికి ప్రపంచ దేశాలు వచ్చాయని, ఈ అపవాదు నుంచి బయటపడేందుకు ఎంతో శ్రమించాల్సి ఉందన్నారు.

తెలంగాణకు తొలి పతకం: సంతోషంగా ఉందన్న చంద్రబాబు (ఫోటోలు)

తెలంగాణకు తొలి పతకం: సంతోషంగా ఉందన్న చంద్రబాబు (ఫోటోలు)

దేశంలో ప్రతిభావంతులకు కొదువ లేనప్పటికీ వారికి సరైన వసతులు, ప్రోత్సాహం అందడం లేదన్నారు. దేశంలో ఆంధ్రప్రదేశ్‌ ఆదర్శంగా నిలిచేలా మండల స్థాయి నుంచి పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీ స్థాయిల్లో క్రీడా సదుపాయాలను కల్పించేందుకు క్రీడా పాలసీని అమలు చేయబోతున్నామని చెప్పారు.

 తెలంగాణకు తొలి పతకం: సంతోషంగా ఉందన్న చంద్రబాబు (ఫోటోలు)

తెలంగాణకు తొలి పతకం: సంతోషంగా ఉందన్న చంద్రబాబు (ఫోటోలు)

దేశంలో ఎప్పటికైనా ఒలింపిక్స్‌ నిర్వహించడమనేది తన కల అన్నారు. ఆ క్రీడల నిర్వహణకు తగ్గట్టు కొత్త రాజధాని అమరావతిలో మౌలిక వసతులు, మైదానాలను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. దేశంలో జరిగే ఏ అంతర్జాతీయ క్రీడలు అయినా ఏపీకి వచ్చేలా, ఏపీలో జరిగే క్రీడలు విశాఖ, విజయవాడ, తిరుపతి వంటి నగరాల్లో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు.

 తెలంగాణకు తొలి పతకం: సంతోషంగా ఉందన్న చంద్రబాబు (ఫోటోలు)

తెలంగాణకు తొలి పతకం: సంతోషంగా ఉందన్న చంద్రబాబు (ఫోటోలు)

బంగారు పతకం సాధించిన క్రీడాకారులకు రూ.7 లక్షలు, కాంస్య పతక విజేతకు రూ.5 లక్షలు, రజత పతక విజేతకు రూ.3 లక్షలు ప్రోత్సాహకంతో పాటు నివాస స్థలం, ఉద్యోగావకాశం కల్పించనున్నట్టు ప్రకటించారు. అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను తయారు చేసేందుకు అనుగుణంగా ప్రత్యేక క్రీడా పాఠశాలలు నెలకొల్పనున్నట్టు చంద్రబాబు తెలిపారు.

 తెలంగాణకు తొలి పతకం: సంతోషంగా ఉందన్న చంద్రబాబు (ఫోటోలు)

తెలంగాణకు తొలి పతకం: సంతోషంగా ఉందన్న చంద్రబాబు (ఫోటోలు)

చిన్న తనం నుంచి వారికి నచ్చిన క్రీడాంశాల్లో శిక్షణను ఇవ్వడం ద్వారా వారిని ఒలింపిక్స్‌కు ఎంపికయ్యే విధంగా తీర్చిదిద్దేందుకు అవసరమై చర్యలు తీసుకుంటామన్నారు. దేశంలో అత్యుత్తమ ప్రతిభ కలిగిన క్రీడాకారులు గల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ముందు వరసలో నిలిపేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.

తెలంగాణకు తొలి పతకం: సంతోషంగా ఉందన్న చంద్రబాబు (ఫోటోలు)

తెలంగాణకు తొలి పతకం: సంతోషంగా ఉందన్న చంద్రబాబు (ఫోటోలు)

త్వరలోనే రాష్ట్రంలో నూతన క్రీడా విధానానికి రూపకల్పన చేయనున్నట్టు ప్రకటించారు. తొలి రోజు పోటీల్లో విజేతలకు ఆయన పతకాలను బహుకరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన వెంకటేష్ అనే క్రీడాకారునికి తన చేతుల మీదుగా జాతీయ పోటీల్లో బంగారు పతకాన్ని అందించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

తెలంగాణకు తొలి పతకం: సంతోషంగా ఉందన్న చంద్రబాబు (ఫోటోలు)

తెలంగాణకు తొలి పతకం: సంతోషంగా ఉందన్న చంద్రబాబు (ఫోటోలు)

జాతీయ అంతర్‌ జిల్లాల జూనియర్‌ అథ్లెటిక్స్‌ మీట్‌లో తొలిరోజు తెలంగాణకు చెందిన రంగారెడ్డి జిల్లా స్వర్ణంతో బోణీ కొట్టింది. అండర్‌-14 లాంగ్‌ జంప్‌ ఫైనల్లో రంగారెడ్డి జిల్లా అథ్లెట్‌ మనన్‌ వెంకటేష్‌ 6.11 మీటర్లు దూకి ప్రథమ స్థానంలో నిలిచాడు. సుమిత్‌ (ఢిల్లీ), ఆదినాథ్‌ (ఉత్తరాఖండ్‌) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.

తెలంగాణకు తొలి పతకం: సంతోషంగా ఉందన్న చంద్రబాబు (ఫోటోలు)

తెలంగాణకు తొలి పతకం: సంతోషంగా ఉందన్న చంద్రబాబు (ఫోటోలు)

లాంగ్‌జంప్ క్రీడాంశంలో బంగారు పతకాన్ని సాధించిన వెంకటేష్‌ను సిఎం కొనియాడారు. రాష్ట్రంలో క్రీడల ప్రోత్సాహానికి, క్రీడా ప్రాంగణాల్లో వౌలిక సదుపాయాల కల్పనకు కార్పొరేట్ సంస్థలు తమ నిధులను వెచ్చించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మంత్రులు అచ్చెన్నాయుడు, సిహెచ్ అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు, ఎంపీ హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+