సందడి అంతా వీరిదే: బాబాయ్‌తో అబ్బాయ్
Chandrababu Naidu and Pawan Kalyan: దేశీయ పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ- నీతా అంబానీ తనయుడు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహ రిసెప్షన్ శుభ్ ఆశీర్వాద్ కార్యక్రమం ఘనంగా సాగుతోంది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ దీనికి వేదిక.
నూతన వధూవరులను ఆశీర్వదించడానికి దేశ, విదేశాల నుంచి రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన సెలెబ్రిటీలు, క్రికెటర్లు దీనికి హాజరవుతున్నారు. పలు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు జియో వరల్డ్ సెంటర్‌కు చేరుకుంటోన్నారు. అమితాబ్ బచ్చన్, రజినీకాంత్, వెంకటేష్.. తళుక్కుమంటూ మెరిశారు.

వివిధ పీఠాధిపతులు సైతం జియో వరల్డ్ సెంటర్‌లో కనిపించారు. ద్వారకా పీఠాధిపతి శంకరాచార్య, స్వామి సదానంద సరస్వతి, జ్యోతిర్మఠానికి చెందిన స్వామి అవిముక్తేశ్వరానంద శంకరాచార్యల వారు ముంబైకి చేరుకున్నారు. ముఖేష్ అంబానీ- నీతా అంబానీ దంపతులు వారికి సాదరంగా ఆహ్వానం పలికారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి కిందటే జియో వరల్డ్ సెంటర్‌కు చేరుకున్నారు. భార్య భువనేశ్వరితో కలిసి ఆయన ముంబైకి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో శుభ్ ఆశీర్వాద్ వేదికకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు సాదర స్వాగతం లభించింది.
ఆ కొద్దిసేపటికే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. జియో వరల్డ్ సెంటర్‌కు వచ్చారు. వారిద్దరూ కూడా వేర్వేరుగా ఈ కార్యక్రమానికి హాజరు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మాల ధారణ వస్త్రాల్లోనే కనిపించారు పవన్. వివిధ పార్టీల నాయకులు ఆయనకు సాదరంగా ఆహ్వానించారు.












Click it and Unblock the Notifications