బాబు: జెసిపి నడిపి, చెరువు గట్టుపై నిద్ర (ఫొటోలు)
కర్నూలు: కాలువ గట్టుపై నిద్రిస్తానని చెప్పిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగానే బుధవారం రాత్రి కర్నూలు జిల్లా అవుకు కాలువ గట్టుపై నిద్రించారు. అంతకు ముందు ఆయన జెసిబి నడిపారు.
ప్రజలను దైవంగా భావించే తాను వారి కోసం దీక్ష చేపట్టానని, ప్రాజెక్టుల పని పూర్తయ్యే వరకు అవసరమైతే కాలువ గట్టుపైనే నిద్రిస్తానని ఆయన చెప్పిన విషయం తెలిసిందే. జలదీక్షలో భాగంగా కర్నూలు జిల్లా అవుకు జలాశయం గట్టుపై బుధవారం రాత్రి నిద్రించారు.
రాయలసీమకు సాగునీటి హబ్‌గా ఉన్న కర్నూలు జిల్లాలోని ప్రాజెక్టుల పనులను బుధవారం ఉదయం చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులతోనే కాకుండా రైతులతో మాట్లాడారు.

ఏరియల్ సర్వే
హైదరాబాదు నుంచి కర్నూలు జిల్లా బానకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ వరకు వచ్చే సమయంలో శ్రీశైలం ప్రాజెక్టు, జలాశయం, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ను హెలికాప్టర్ నుంచే ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు.

అధికారులతో ముచ్చెట
సాగునీటిశాఖ ఉన్నతాధికారులు చంద్రబాబుకు ఆయా ప్రాజెక్టుల గురించి వివరించారు. బానకచెర్లకు చేరుకున్న వెంటనే క్రాస్ రెగ్యులేటర్ కాంప్లెక్స్‌లోని తెలుగుగంగ, కేసీ, శ్రీశైలం కుడి కాలువలకు నీటి విడుదలయ్యే విధానాన్ని తెలుసుకున్నారు.

మూడు కాలువలకు ఒకే చోటు నుంచి..
మూడు కీలకమైన కాలువలకు ఒక చోట నుంచి నీటిని మళ్లించే విధానం తెలుసుకున్న అనంతరం చంద్రబాబు ఎస్సార్బీసి, ఎస్సారెంసీ పనులను పరిశీలించి కాంట్రాక్టర్లతో మాట్లాడారు. కొద్దిసేపు రైతులతో మాట్లాడి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు.

ప్రభుత్వ కార్యక్రమాలపై...
ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను చంద్రబాబు వివరించారు. అక్కడి నుంచి గోరుకల్లు జలాశయం వద్దకు హెలికాప్టర్‌లో చేరుకున్నారు. అక్కడ జరగుతున్న పనులను పరిశీలించి కాంట్రాక్టర్లు, అధికారులతో చర్చించారు.

రైతులతో ముఖాముఖి
చంద్రబాబు ఆ తర్వాత రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులతో మాట్లాడిన అనంతరం భోజనం ముగించుకొని కొద్ది సేపు విశ్రాంతి తీసుకున్నారు.

సాయంత్రానికి..
బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో హెలికాప్టర్‌లో అవుకు జలాశయం వద్దకు చేరుకున్న చంద్రబాబు అక్కడి నుంచి సమీపంలోని సంగపట్నం గ్రామానికి చేరుకొన్నారు.

పూడికతీతకు శ్రీకారం..
సంగపట్నంలో ఏర్పాటు చేసిన నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా చెరువు పూడిక తీత పనులకు భూమి పూజ చేశారు.

జెసిబీ ఎక్కి...
సంగపట్నంలో జెసిబి ఎక్కి యంత్రాన్ని కదిలించి పనులను ప్రారంభించారు.












Click it and Unblock the Notifications