ఎంపీలు రాజీనామా చేస్తే బిజెపికే లాభం, కేంద్రంపై అంచెలంచెల పోరుకు బాబు ప్లాన్

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఎంపీలు రాజీనామాలు చేస్తే బిజెపికి ప్రయోజనం లాభం చేకూర్చిననట్టేనని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు అంచెలంచెల వ్యూహలను అమలు చేయనున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు.

పురంధరేశ్వరీకి టిడిపి కౌంటర్: రెవిన్యూలోటుకు కొత్త నిర్వచనం

కేంద్ర మంత్రివర్గం నుండి వైదొలిగిన తర్వాత పార్టీ నాయకులతో ఏపీ చంద్రబాబునాయుడు టెలికాన్పరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై టిడిపి సమన్వయ కమిటీ సమావేశాన్ని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిర్వహించారు.

ఎన్డీఏలోనే ఉంటారా, వైదొలుగుతారా, బాబు నెక్ట్స్ ప్లాన్ ఏమిటి?

రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిస్థితులపై పార్టీ నేతలకు బాబు దిశా నిర్ధేశం చేశారు. ఏపీ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రజలకు వివరించాలని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు.

కాంగ్రెస్, బిజెపిల తీరును ప్రజలకు వివరించాలి

కాంగ్రెస్, బిజెపిల తీరును ప్రజలకు వివరించాలి

ఏపీ రాష్ట్రంపై కాంగ్రెస్, బిజెపి నేతలు వ్యవహరిస్తున్న తీరు వల్లే ఈ పరిస్థితి నెలకొందన్నారు. ఈ రెండు జాతీయ పార్టీలు ఏపీ ప్రజలను అర్ధం చేసుకోలేదని చంద్రబాబునాయుడు చెప్పారు. ఈ రెండు పార్టీలు ఏ రకంగా ఏపీకి అన్యాయం చేశారనే విషయమై ప్రజలకు వివరించాలని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు.

ఎంపీలు రాజీనామాలు చేస్తే బిజెపికే లాభం

ఎంపీలు రాజీనామాలు చేస్తే బిజెపికే లాభం

ప్రస్తుత పరిస్థితుల్లో ఎంపీలు రాజీనామాలు చేస్తే రాజకీయంగా బిజెపికే ప్రయోజనం కలుగుతోందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. ఎంపీలు రాజీనామాల వల్ల ఏపీ రాష్ట్రానికి ప్రయోజనం కలగదని బాబు అభిప్రాయపడ్డారు. టిడిపి ఎంపీలు పార్లమెంట్‌లో నిరసనలు చేస్తోంటే వైసీపీ ఎంపీలు కూర్చొంటున్నారని బాబు అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి ఏ నిర్ణయం తీసుకొంటే ప్రయోజనమనే విషయమై సరైన సమయంలో నిర్ణయం తీసుకొంటామని బాబు చెప్పారు.

బిజెపి అన్యాయంపై ప్రచారం

బిజెపి అన్యాయంపై ప్రచారం

ఏపీ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రజల్లో ప్రచారం చేయాలని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు. రాష్ట్రానికి న్యాయం జరుగుతోందనే ఉద్దేశ్యంతోనే బిజెపితో పొత్తు పెట్టుకొన్నట్టుగా చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు చెప్పారు. కానీ, బిజెపి కూడ ఏపీకి న్యాయం చేయలేదని చంద్రబాబునాయుడు అసంతృప్తిని వ్యక్తం చేశారు. బిజెపి ఏ రకంగా ఏపీకి అన్యాయం చేసిందనే విషయమై ప్రజలకు వివరించాలన్నారు.

అంచెలంచెలుగా వ్యూహలను అమలు చేస్తాం

అంచెలంచెలుగా వ్యూహలను అమలు చేస్తాం


కేంద్ర మంత్రివర్గం నుండి వైదొలిగి, ఎన్డీఏలో కొనసాగడంపై విమర్శలు వస్తున్నాయని పలువురు టిడిపి నేతలు చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకొచ్చారు. అయితే కేంద్రం నుండి రాష్ట్రానికి నిధుల విడుదల విషయమై ఒత్తిడి తీసుకురానున్నట్టు చెప్పారు.కేంద్రంపై ఒత్తిడిని పెంచేందుకు అంచెలంచెలుగా వ్యూహలున్నాయని బాబు పార్టీ నేతలకు చెప్పారు. ఈ వ్యూహలను అమలు చేయనున్నట్టు చెప్పారు.

ఎంపీల నిరసనపై బాబు ప్రశంస

ఎంపీల నిరసనపై బాబు ప్రశంస

ఏపీ రాష్ట్రానికి నిదుల విషయమై పార్లమెంట్‌లో టిడిపి ఎంపీలు చేస్తున్న పోరాటంపై టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు అభినందించారు. రాష్ట్రానికి న్యాయం చేసే వరకు పోరాటం కొనసాగుతోందని బాబు చెప్పారు. మరో వైపు బిజెపిపై మరింత దూకుడును పెంచాలని టిడిపి నేతలు కొందరు బాబు దృష్టికి తీసుకొచ్చారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Chandrababu Naidu said that he believes the resignations of MPs are beneficial to BJP.Chandrababu Naidu conducted teleconference with party leaders on Friday

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి