నారాయణ కాలేజీలో అమ్మాయిలు చనిపోతే, ప్రవర్తన మంచిది కాదంటారా?: చంద్రబాబుపై ఐద్వా
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దేశంలోనే అతి పెద్ద మోసగాడని అఖిల భారత ప్రజాతంత్ర మహిలా సంఘం (ఐద్వా) రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శలు బి.ప్రభావతి, డి.రమాదేవి ఆరోపించారు. ఐద్వా విశాఖ నగర కమిటీ ప్లీనరీ సమావేశం సోమావారం వైశాఖి జల ఉద్యానవనంలో జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల సమస్యలు పరిష్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మొర పెట్టుకుంటే ఉక్కుపాదంతో అణచివేస్తున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యంగా నాగార్జున యూనివర్సిటీలో జరిగిన రిషికేశ్వరి ర్యాగింగ్ ఘటనపై ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేయకపోడవం శోచనీయమన్నారు.

కడప జిల్లాలోని నారాయణ కాలేజీలో ఇద్దరు అమ్మాయిలు చనిపోతే, వారి ప్రవర్తన మంచిది కాదని ప్రచారం చేశారని ప్రభుత్వంపై మండిపడ్డారు. నర్సీపట్నంలో దివ్యశ్రీ హత్య కేసులో నిందితులను శిక్షించాలని ఆందోళన చేశామన్నారు.
అయితే నిందితులను కాకుండా ఆందోళనకు దిగిన నిరసకారులను నిర్బంధించి చంద్రబాబు ప్రభుత్వం కేసులు పెట్టిందని తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. ఇక ఎన్టీ రామారావు ఆస్తిహక్కు చట్టాన్ని తీసుకొస్తే దానిని దేశ వ్యాప్తంగా చట్టం చేశారని, అయితే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాన్ని రద్దు చేసిందని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications