చంద్రబాబు చైనా పర్యటనలో 'దొనకొండ'కు ప్రాధాన్యత: ఒప్పందాలివే (ఫోటోలు)
అమరావతి: ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా మంగళవారానికి చంద్రబాబు చైనా పర్యటన మూడో రోజుకు చేరుకుంది. చైనాలో పర్యటిస్తున్న చంద్రబాబు రెండో రోజైన సోమవారం పలు కంపెనీలతో భారీ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రూ.53 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన కీలక ఒప్పందాలు జరిగాయి.
ముందుగా టియాంజిన్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో చంద్రబాబు ప్రసంగించారు. పలు అంతర్జాతీయ సంస్ధల ప్రతినిధులతో సమావేశమై, ఏపీలో పరిశ్రమల ఏర్పాటుక గల అవకాశాలను వివరించారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్లు, ద్వైపాక్షిక చర్చలు, అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటూనే ప్రపంచ పారిశ్రామికవేత్తలను నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో పర్యటించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
చైనా పర్యటనలో ఏపీ ప్రభుత్వం చేసుకున్న కీలక ఒప్పందాల్లో ముఖ్యమైనవి ఇవే. కృష్ణపట్నం సమీపంలో రూ.10,183 కోట్లతో గ్యాస్ ఆధారిత ఎరువుల కర్మాగారం ఏర్పాటుకి ఒప్పందం కుదిరింది. ఈ కర్మాగారం వల్ల ప్రత్యక్షంగా 5వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. 2017-18 సంవత్సరాల మధ్య ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభమవుతుంది.
ప్రకాశం జిల్లా దొనకొండలో 10 వేల ఎకరాల్లో అంతర్జాతీయ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కానుంది. ఈ పార్కుని మూడు దశల్లో రూ.43,120 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. సోమవారం ప్రపంచంలోని 280 దేశాల్లో పార్శిల్, కార్గో సేవలను అందిస్తున్న యునైటెడ్ పార్శిల్ సర్వీసెస్ గ్రూప్ కార్పొరేట్ స్ట్రాటజీ ప్రెసిడెంట్ జాన్ విల్లెం బ్రీన్‌తో భేటీ అయ్యారు.
ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఏపీలో రవాణా వ్యవస్థలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను ఆయనకు వివరించారు. ఏపీఎస్‌ఆర్టీసీ జీపిఎస్ వ్యవస్థకు అనుసంధానమై ఉందని ఆయనకు వివరించారు. విశాఖపట్నం, కృష్ణపట్నం ఓడరేవులను కార్గోహబ్‌లుగా ఏర్పరచుకోవాలని బ్రీన్‌కు సూచించారు.
ఈసందర్భంగా బ్రీన్ స్పందిస్తూ తమ సంస్థ బిజినెస్ టు బిజినెస్‌లోనే కాదు, బిజినెస్ టు కన్స్యూమర్ పద్ధతిని విశ్వసిస్తుందని ఆయన చెప్పారు. మరోవైపు జపాన్ ఎక్స్‌టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ యాసుషి అకాహోషితో భేటీ అయ్యారు. ఏపీతో జెట్రో సంస్థకు మొదటి నుంచి సంబంధాలు ఉన్నాయని, గత పర్యటనలు సత్ఫలితాలు ఇచ్చాయని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు.
తూర్పు తీరానికి ముఖద్వారమైన ఏపీలో 974 కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం వంటి డీప్ సీవాటర్ పోర్టులు ఉన్నాయని చంద్రబాబు వారికి వివరించారు. ఇలాంటి తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే వ్యాపారాలు బాగా సాగుతాయని చెప్పారు.
జపాన్, తదితర ఆసియా దేశాలకు ఏపీ మంచి గమ్యస్థానమని అన్నారు. దీంతో జెట్రో ప్రెసిడెంట్ యాసుషి అకాహోషి చంద్రబాబు ప్రసంగానికి స్పందిస్తూ తాము త్వరలోనే విజయవాడకు ప్రతిపాదనలతో వస్తామని తెలిపారు.

చంద్రబాబు చైనా పర్యటనలో 'దొనకొండ'కు ప్రాధాన్యత
ప్రకాశం జిల్లా దొనకొండలో 43,120 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ పారిశ్రామిక పార్క్‌ను ఏర్పాటు చేయడానికి చైనా అసోసియేషన్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైన్యూర్స్, చైనా స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్ లిమిటెడ్ (బీజింగ్)లతో ఎపిఈడిబి, ఇండస్ట్రీస్, కామర్స్ మినిస్ట్రీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

చంద్రబాబు చైనా పర్యటనలో 'దొనకొండ'కు ప్రాధాన్యత
ఈ ఒప్పందాల ప్రకారం 6036 కోట్ల రూపాయల పెట్టుబడితో బిల్డింగ్ మెటీరియల్ ఇండస్ట్రియల్ పార్క్, 36,889 కోట్లతో మోడ్రన్ బిల్డింగ్ మెటీరియల్ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. 40 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటుకానున్న ఈ పార్కుల్లో 45వేల మందికి ఉపాధి లభించనుంది.

చంద్రబాబు చైనా పర్యటనలో 'దొనకొండ'కు ప్రాధాన్యత
ఈ ఒప్పందాలతో ఏపీలో తొలిసారిగా అంతర్జాతీయ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటవుతుంది. ప్రకాశం జిల్లా దొనకొండలో పది వేల ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఇండస్ట్రియల్ పార్క్ 6.4 బిలియన్ డాలర్ల పెట్డుబడితో ఏర్పాటుకానుంది. ఇందులో 55వేల మందికి ఉపాధి లభించనుంది.

చంద్రబాబు చైనా పర్యటనలో 'దొనకొండ'కు ప్రాధాన్యత
43,120 కోట్ల వ్యయంతో పూర్తికానున్న ఇండస్ట్రియల్ పార్క్‌లో మొదటి దశలో 10,106.2 కోట్లు, రెండో దశలో 12,127 కోట్లు, మూడో దశలో 14,148.8 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నారు. తొలిదశలో 10వేల మందికి, రెండో దశలో 21వేల మందికి, మూడో దశలో 24వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది.

చంద్రబాబు చైనా పర్యటనలో 'దొనకొండ'కు ప్రాధాన్యత
మొత్తం మీద ఈ పార్క్ ప్రారంభమైతే లక్షన్నర మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించబోతోంది. కాగా, కృష్ణపట్నం సమీపంలో గ్యాస్ ఆధారిత ఎరువుల కర్మాగారం ఏర్పాటుకు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. చైనా హాంక్యూ కంట్రాక్టింగ్ అండ్ ఇంజనీరింగ్ కార్పొరేషన్, ఇసోమెరిక్ హోల్డింగ్స్, ఎల్‌ఇపిఎల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఏపిఇడిబి, డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ మధ్య ఒప్పందాలు కుదిరాయి.












Click it and Unblock the Notifications