Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇదెక్కడి న్యాయం?: ట్రంప్‌పై చంద్రబాబు వ్యాఖ్యలు, ఆ వ్యక్తి ఎవరు

అమరావతి: రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఉదయం వెలగపూడిలోని సీఎం ఛాంబర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతిలో వరదలు వచ్చే అవకాశముందని కొందరు అంటున్నారని, హైదరాబాద్‌లోనూ‌, చెన్నైలోనూ వరదలు రాలేదా? అని వ్యాఖ్యానించారు.

ఇదెక్కడి న్యాయం?
ప్రజలకు ప్రభుత్వం చేసే సంక్షేమం గుర్తుండటం లేదన్నారు. ఎంత చేసినా ఓట్లు వేసేముందు మాత్రం ఇచ్చే ఐదు వందల కోసమే ప్రజలు చూస్తున్నారని అన్నారు. "ఐదేళ్ల పాటు నెలకు 1000 రూపాయల పెన్షన్ ఇచ్చి, 5 కేజీల బియ్యమిచ్చి, ఎవరైనా చనిపోతే ఐదు లక్షలిచ్చి, అదే మాదిరిగా ఊర్లలో నీరు లేకపోతే నీళ్లిచ్చి, కరెంటు లేకపోతే కరెంటిచ్చి, గ్యాస్ లేకపోతే గ్యాస్ ఇచ్చి వాళ్లకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించాలన్న ఉద్దేశంతో అన్నీ కల్పిస్తే చివర్లో ఎవడైతే 500 రూపాయలు ఇస్తే వాళ్లకే ఓటేస్తాడు." అని చంద్రబాబు అన్నారు.

ఇదెక్కడి న్యాయం? అని ప్రశ్నించారు. ఆ ఐదొందలకు, వెయ్యికి ఇప్పుడు ఎమ్మెల్యేల పోటీపడుతున్నారు. నాదగ్గర డబ్బులేదు కాబట్టి, రేపు ఎలక్షన్లలో పోటీ చేయాలంటే, ఇప్పటి నుంచే డబ్బు దాచుకోవాలని ఎమ్మెల్యేలు చూస్తున్నారు. వేరీజ్ వాల్యూ? అని అన్నారు. రెండంకెల వృద్ధి రేటుకు అవకాశం ఉన్న ఏకైక దేశం భారతదేశమని అన్నారు.

కుటుంబ విలువల గురించి ప్రస్తావన
చైనా ఆర్థికవ్యవస్థ పడిపోయిన తర్వాత ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తోందన్నారు. ఇదే క్రమంలో కుటుంబ విలువలను గురించి ప్రస్తావించారు. ట్రంప్ మాటలు చూస్తుంటే, అగ్రదేశం అమెరికాలో కూడా నాయకత్వలేమి ఉందన్నారు. భారతదేశంలో ఉన్న కుటుంబ విలువలు ప్రపంచంలో ఎక్కడా లేవని కొనియాడారు.

మన ఆనందానికి ప్రధాన కారణం కుటుంబ బంధమేనన్నారు. 'అమెరికాలో ఎన్నెన్నో పెళ్లిళ్లు చేసుకుంటారో మనం చూస్తున్నాం. ట్రంప్‌కు ఇప్పుడున్నావిడ నాలుగో భార్య అనుకుంటా' అని వ్యాఖ్యానించారు. అన్ని పెళ్లిళ్లు చేసుకోవడం తాత్కాలిక ఎంజాయ్‌మెంట్ మాత్రమేనని పేర్కొన్నారు. మన ఆనందానికి కారణం కుటుంబ బంధమేనని ఆయన పేర్కొన్నారు.

చైనాలో కూడా కుటుంబ విలువలు లేవన్నారు. మనం సమష్టి కుటుంబంలో ఉంటున్నామని, ఇప్పుడు కొన్ని మారుతున్నాయిని, అలా మారకూడదన్నారు. ఏసీ రూంలో పనిచేసుకున్న తర్వాత కూడా మనం ఇంటికి వెళ్లి గడపాలని సూచించారు. అంతేతప్ప రోబోలతో ఆడుకోకూడదన్నారు. ఏపీకి కష్టాలు, అవమానాలు ఎదురవ్వడంతోనే అమరావతికి తిరిగొచ్చామన్నారు.

మనుషుల్లో స్వార్థం, ఒక వ్యక్తి దగ్గర రూ. 10 వేల కోట్లు
మనుషులకు స్వార్థం పెరిగిపోతోందన్నారు. డబ్బులుంటే ఏమైనా చేయచ్చని అనుకుంటున్నారన్నారు. డబ్బులుంటే సమాజం గౌరవిస్తుందని అడ్డదిడ్డంగా సంపాదిస్తున్నారన్నారు. డబ్బులు వస్తూనే ఏం చేయాలో తెలియదు కాబట్టి ఎంజాయ్ చేయడం మొదలుపెడతారన్నారు. దీనంతటికీ కారణం బ్యాంకు లావాదేవీలు కాకుండా.. నగదు లావాదేవీలేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

సంపాదన కోసం ఎమ్మెల్యేలు పోటీపడుతున్నారన్నారు. హైదరాబాద్‌లో రూ. 13వేల కోట్ల నల్లధనం ఇటీవల బయటపడిందన్నారు. ఒక వ్యక్తి దగ్గర రూ. 10 వేల కోట్లు అక్రమ సంపాదన ఉంటే సామాన్యులు ఎలా బతుకుతారని ఆయన ప్రశ్నించారు. అయితే ఆ వ్యక్తి ఎవరనేది మాత్రం చంద్రబాబు ప్రస్థావించలేదు. నల్లధనం సంపాదించే వారికి రాజకీయాలు అడ్డాగా మారాయయన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+