జపాన్ టు ఢిల్లీ: తిరుగుపయనమైన ఏపీ సీఎం చంద్రబాబు
న్యూఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బృందం జపాన్ పర్యటనను ముగించుకుని గురువారం స్వదేశానికి బయలుదేరింది. జపాన్ నుంచి చంద్రబాబు నాయుడు నేరుగా ఢిల్లీ చేరుకుంటారు. అనంతరం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు పలువురు కేంద్రమంత్రులతో భేటీ అవుతారు.
ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన వివిధ సమస్యలు, అంశాలను వారి దృష్టికి తీసుకెళ్తారు. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడం, నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్ధాపనకు జపాన్ ప్రధాని షింజో అబేను ఆహ్వానించే నిమత్తం మూడు రోజుల క్రితం చంద్రబాబు బృందం జపాన్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.

సీఎం వెంట మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావులతో పాటు కీలక శాఖల ఉన్నతాధికారుల బృందంతో జపాన్ వెళ్లిన చంద్రబాబు అక్కడి పారిశ్రామిక దిగ్గజాలతో వరుస భేటీలు నిర్వహించారు.
నవ్యాంధ్రలో పెట్టుబడులు పెట్టేందుకు ఊహించిన దానికంటే ఎక్కువగానే అక్కడి పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చారు. విశాఖపట్నం కేంద్రంగా గ్రిడ్‌పై పని చేయాలని తోషిబా ప్రతినిధులను ముఖ్యమంత్రి కోరారు. అందుకు తోషిబా సైతం అంగీకరించింది.
అదే విధంగా హోండా వాహన తయారీ ప్లాంట్‌ను ఏపీలో ఏర్పాటు చేస్తే అందుకు అవసరమైన అన్ని వసతులు, ఏర్పాట్లను చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీనిపై హోండా ప్రతినిధి బృందాన్ని ఏపీకి పంపుతామని చెప్పినట్టు అధికారులు తెలిపారు. చంద్రబాబు బృందం జేబీసీ కార్పోరేషన్‌తో సమావేశమయ్యారు. వీరు కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపారు.
చివరిరోజున చంద్రబాబు బృందం కొమమురా సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. కెమెరాలు, లెన్స్‌లు, ఆప్టిక్స్ కంపెనీగా కొమమురా కంపెనీకి మంచి పేరుంది. ఏపీలో కొమమురా యూనిట్‌ను ఏపీలో ఏర్పాటు చేయాలనిచంద్రబాబు ఆహ్వానించారు. విపత్తులు సంభవించినపుడు రాత్రివేళ రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహణలో అనుభవమున్న కొమమురా కంపెనీ ఏపీలో యూనిట్ పెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులు చేయాలని సంకల్పించింది.












Click it and Unblock the Notifications