సత్య నాదెళ్లకు మాతృవియోగం, చంద్రబాబు సంతాపం
హైదరాబాద్: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తల్లి ప్రభావతి శనివారం నాడు కన్నుమూశారు. హైదరాబాదులో ఉంటున్న ఆమె వయస్సు 85. కొన్నాళ్లుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె బంజారాహిల్స్ సాగర్ సొసైటీలోని తన స్వగృహంలో కన్నుమూశారు. ఈ విషయం తెలిసిన సత్యనాదేళ్ల హైదరాబాద్ బయలుదేరారు.
ప్రభావతి అస్వస్థతకు గురి కావడంతో ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రభావతి భర్త యుగందర్ మాజీ ఐఏఎస్ అధికారి.

సత్యనాదెళ్ల తల్లి ప్రభావతి మృతి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శనివారం సంతాపం తెలిపారు. వారి కటుంబానికి ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఆమె మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications