నాకు చెప్పొద్దు!: ముగ్గురికి దిమ్మతిరిగేలా చంద్రబాబు సమాధానం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసిపి అధినేత జగన్, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్ర రావులకు కౌంటర్ ఇచ్చారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసిపి అధినేత జగన్, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్ర రావులకు కౌంటర్ ఇచ్చారు.
ప్రత్యేక హోదా
ప్రత్యేక హోదా కోసం జల్లికట్టు స్ఫూర్తిగా పోరాడాలని పవన్, జగన్‌లు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా జనవరి 26న ఆర్కే బీచ్‌లో జరగనున్న సభకు వారు వేర్వేరుగా మద్దతు తెలిపారు. దీనిపై చంద్రబాబు ఘాటుగా స్పందించారు.

అసలు, జల్లికట్టుకు ప్రత్యేక హోదాకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. హోదాతో సమానంగా ప్యాకేజీ ఇచ్చినందువల్లే అంగీకరించానని చెప్పారు. ఏపీకి అన్యాయం జరిగితే తానే పోరాడుతానని తేల్చి చెప్పారు. తాము ఎక్కడా రాజీపడమన్నారు.
పోలవరం నిర్మాణంపై.. కేవీపీకి
పోలవరం ప్రాజెక్టు తామే కట్టామని చంద్రబాబు స్కోత్కర్ష చేసుకుంటున్నారని, కాంగ్రెస్ పాత్ర ఎంతో ఉందని పలుమార్లు కేవీపీ చెప్పారు. అంతేకాదు, ఆయన చంద్రబాబుకు లేఖలు కూడా రాశారు. దీనిపై చంద్రబాబు పరోక్షంగా స్పందించారు.
విభజన సమయంలో మాట్లాడని వాళ్లు ఇప్పుడు లేఖలు రాస్తున్నారని, ఆ లేఖలు ఏవో అప్పుడు రాస్తే బాగుండేదని ఎద్దేవా చేశారు. పోలవరం పనులు తాము చేపట్టకుంటే ముందుకు కదిలేదా అని నిలదీశారు. ఇప్పుడు లేఖలు రాసే బదులు అధికారంలో ఉన్నప్పుడు కట్టవచ్చు కదా అని నిలదీశారు.
పోలవరం ఇష్యూపై..
పవన్ కళ్యాణ్ లేవనెత్తుతున్న ప్రతి సమస్యకు పరిష్కారం చూపించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నాడు రాజధాని భూసేకరణ దగ్గర నుంచి ఉద్దానం వరకు ఇదే విధానాన్ని అవలంభించింది. అయితే కొద్ది రోజుల క్రితం పవన్‌ను పోలవరం, రాజధాని ప్రాంతాల్లోని లంక గ్రామాల రైతులు కలిశారు.
ప్రభుత్వంవైపు నుంచి తమకు అన్యాయం జరుగుతోందన్నారు. పోలవరం స్పిల్‌వే పనుల్లో భాగంగా తీస్తున్న మట్టిని పంటలు, డంపింగ్ యార్డుకోసం సేకరించిన భూమిలో వేస్తున్నారు. భూమిని ఇచ్చిన రైతులు తమకు పరిహారం విషయంలో అన్యాయం జరిగిందని గోడు వెల్లబోసుకున్నారు. రైతులకు పవన్ భరోసా ఇచ్చారు.
దీనిపై స్పందించిన చంద్రబాబు.. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడారు. సమస్యను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. తన ప్రభుత్వ హయాంలో ఏ ఒక్కరికీ అన్యాయం జరగదని చెప్పారు.
రాయపాటి కంపెనీపై..
మరోవైపు పవన్ పోలవరం కాంట్రాక్ట్ పొందిన ఎంపీ రాయపాటి ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీపైనా విమర్శలు చేశారు. దీనిపై స్పందించిన చంద్రబాబు ప్రస్తుతం పోలవరం పనులను ట్రాన్స్‌ట్రాయ్ చేయడం లేదని, ప్రభుత్వమే చేస్తోందన్నారు.
రాజధాని ప్రాంతంలోని లంక భూముల రైతులు కూడా పవన్‌ను కలిశారు. ఎకరానికి 1450 గజాల భూమిని ఇస్తానన్న ప్రభుత్వం ఇప్పుడు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పవన్ ఘాటుగా స్పందించారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తోందన్నారు.
దీనిపై కూడా చంద్రబాబు సూటిగా స్పందించారు. జరుగుతున్న అభివృద్ధిపై అవగాహన లేకుండా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని కొద్దిమందే రైతుల కోసం గొడవలు చేస్తున్నారన్నారు.
మిత్రపక్షంగా చూస్తూనే..
జనసేనను మిత్రపక్షంగా చూస్తూనే పవన్ కళ్యాణ్ లేవనెత్తుతున్న సమస్యలను వీలైనంత వరకు చంద్రబాబు ప్రభుత్వం పరిష్కరిస్తోంది. అదే సమయంలో పవన్ చేసే విమర్శలకు స్పందిస్తోంది. బోండా ఉమ కూడా నిన్న స్పందించారు. పవన్ పోలవరం, అమరావతిలకు వెళ్లి చూడాలని హితవు పలికారు. రాయపాటి సాంబశివ రావు కూడా కౌంటర్ ఇచ్చారు.
-
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం












Click it and Unblock the Notifications