చంద్రబాబు గిఫ్ట్, రూ.20 లక్షల కారు రూ.9 లక్షలకే! 222 కార్ల పంపిణీ

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎస్సీ యువతకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఉపాధిలో భాగంగా రూ.20 లక్షల కారును అతి తక్కువ ధరకే ఇస్తున్నారు.

చంద్రబాబు తన కార్యాలయం వద్ద దళిత యువతకు ఉపాధి కల్పనలో భాగంగా వాహనాలను పంపిణీని ప్రారంభించారు. ఏపీ షెడ్యూల్ కులాల ఎస్సీ కార్పోరేషన్ ఆధ్వర్యంలో 222 క్యాబ్స్ ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.

రూ.20లక్షల విలువ చేసే ఇన్నోవా క్రిష్టను రూ.16 లక్షలకే వ‌చ్చేలా ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింద‌ని చంద్రబాబు తెలిపారు. అయితే, ఆ మొత్తం రూ.16 లక్షల్లోనూ రూ. 7లక్షల సబ్సిడీని ప్రభుత్వం భరించనుంద‌న్నారు.

Chandrababu Naidu distributes cars to SC youth

దీంతో ల‌బ్ధిదారుడికి అంతిమంగా రూ.9 ల‌క్ష‌ల‌కే కారు దక్కనుంది. రూ.30 కోట్ల పెట్టుబడితో ఈ వాహనాలను పంపిణి చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు.
ఎప్పటికప్పుడు డ్రైవింగ్ శిక్షణ ఇస్తామన్నారు.

ఓలా, ఉబర్ లాంటి సంస్థలతో ఈ యువతను అనుసంధానిస్తామని హామీ ఇచ్చారు. ఒక్కో వాహనం ద్వారా నెల‌కు రూ.12 వేలు నుంచి రూ.22 వేలు వరకు ఆదాయం లభిస్తుందని చంద్రబాబు చెప్పారు.

ఈ ఏడాది చివరిలోనే 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి రావెల కిషోర్ బాబు, ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ ఛైర్మన్‌ జూపూడి ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu distributed cars to SC youth in Amaravati on Wednesday.
Please Wait while comments are loading...