జగన్ సభ చూసి చంద్రబాబుకు వణుకు
విజయవాడ: నరసరావుపేటలో వైఎస్ జగన్ బహిరంగ సభను చూసి టీడీపీ నేతలు వణికిపోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేక పిచ్చి ప్రేలాపణలు పేలుతున్నారన్నారు. మంత్రి దేవినేని ఉమ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని.. ప్లేస్, టైమ్ దేవినేని ఉమానే డిసైడ్ చేసుకోవాలని పార్థసారధి సవాల్ విసిరారు.












Click it and Unblock the Notifications