‘‘నేనూ మనిషినే..": జగన్ చెప్పు వ్యాఖ్యలతో చంద్రబాబు బాధపడ్డారా?

అమరావతి: రాష్ట్ర అభివృద్ధి కోసం తాను నవ నిర్మాణ దీక్ష, మహా సంకల్పాన్ని యజ్ఞంలా చేస్తుంటే దానిని చెడగొట్టేందుకు కొందరు రాక్షసుల్లా ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్ష నేత జగన్‌పై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నవనిర్మాణ దీక్షలో భాగంగా ఆదివారం విజయవాడలో చంద్రబాబు మాట్లాడుతూ రాజకీయ ముసుగులో పార్టీ పెట్టి తప్పులన్నీ ఒప్పులుగా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

''రామలింగరాజు, విజయ్‌మాల్యా వంటివారు తప్పులు చేశారు. వారెక్కడైనా మాట్లాడుతున్నారా? ఈయన ఎమ్మెల్యే అయ్యేసరికి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. 'నా అనుభవం అంత వయసు లేని వ్యక్తి నన్ను మాటలతో బాధ పెడుతున్నాడు. అయినా ప్రజల కోసం భరిస్తున్నా' అని వ్యాఖ్యానించారు.

cbn

'అనంత'లో జగన్ చెప్పిన సినిమా స్టోరీ ఇదే!: అందులో చంద్రబాబే విలనట!

నవ నిర్మాణ దీక్ష, మహా సంకల్పం పవిత్రతను దెబ్బతీసేందుకే అనంతపురం యాత్ర పేరుతో నోటికి వచ్చింది మాట్లాడుతున్నారని అన్నారు. ''నేనూ మనిషినే.. నన్ను అవమానించేలా మాట్లాడితే ఎంత బాధగా ఉంటుంది? అని అన్నారు. 'చెడ్డ వారి గొంతు పెద్దగా వినిపించినప్పుడు మంచి వారు మౌనం వహించడం దుష్పరిణామాలకు దారి తీస్తుంది' అని వ్యాఖ్యానించారు.

'అలాంటివారితో ఘర్షణ పడటం వల్ల ప్రజలకు, మనకే నష్టం. ప్రజాచైతన్యంతోనే వారికి సరైన శిక్ష పడుతుంది. ఇలాంటి వారి రాజకీయ ముసుగు తొలగించి వారు చేసినా నేరాలపై చట్టపరంగా చర్యలు తీసుకుందాం' అని జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 'ప్రభుత్వం అన్ని విషయాల్లోనూ సానుకూల దృక్పథంతో ముందుకెళుతుంటే, ప్రతిపక్షాలు ప్రతికూల దృక్పథంతో.. వ్యతిరేక ధోరణితో వ్యవహరిస్తున్నాయని అన్నారు.

అందుకే ప్రజల విశ్వాసానికి అవి దూరమయ్యయాని పేర్కొన్నారు. అంతేకాదు ప్రభుత్వం చేపట్టిన ప్రతి పవిత్రమైన కార్యక్రమాన్ని చెడగొట్టడమే లక్ష్యంగా ప్రతిపక్షం పనిచేస్తోందని చంద్రబాబు విమర్శించారు. రాజధాని శంకస్థాపనను చెడగొట్టాలని ప్రయత్నించారని గుర్తుచేశారు.

అమరావతిలో రైతులు రాజధానికి ఇచ్చిన 34 వేల ఎకరాలను అభివృద్ధి చేస్తుంటే.. రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని.. ఎక్కడ అవినీతి జరిగిందో చూపించాలని చంద్రబాబు ప్రశ్నించారు. ఒక ఊరిలో ఉన్మాది ఉంటే అందరూ భయపడతారని, అందరూ భయడితే అతను ఆంబోతులా రెచ్చిపోయి అంతా నాశనం చేస్తాడని అన్నారు.

ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఉందని, అయితే కార్యకర్తలు సంయమనం వహించాలని కోరారు. ఎవరికి వారు క్రమశిక్షణ, సామాజిక స్పృహాతో మెలగాలని.. పంటలు బాగా పండించాలని.. పల్లెల్ని పరిశుభ్రంగా ఉంచుకుని, ఆరోగ్యానికి ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఈ రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై భారీగా ప్రచారం చేపట్టాలని సీఎం సూచించారు.

రాష్ట్రంలో ప్రతిరంగంలో నాయకత్వం ప్రతిభావంతంగా ఉండాలని ఆకాంక్షించారు. అన్ని రంగాల వారు కష్టపడి మంచి ఫలితాలు సాధిస్తే మన రాష్ట్రం దేశానికి రోల్‌ మోడల్‌గా ఉంటుందన్నారు. గోదావరి, కృష్ణా నదులను అనుసంధానించి ఈ ఏడాది రూ.2400 కోట్ల విలువైన పంటను కాపాడినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+