వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మేల్యేలా బజారు రౌడీలా?, నాపైకే దాడికి వస్తారా?: చంద్రబాబు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాల్‌మనీ వ్యవహారంపై అధికార ప్రతిపక్షాల నినాదానాలతో శుక్రవారం అసెంబ్లీ దద్దరిల్లింది. కాల్‌మనీ వ్వవహారంపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన ఇచ్చే సమయంలో ప్రతిపక్ష వైయస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి చంద్రబాబు వైపు దూసుకెళ్లారు. దీంతో అసెంబ్లీలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.

రాష్ట్రవ్యాప్తంగా వడ్డీ వ్యాపారులపై 227 ఫిర్యాదులు వచ్చాయని, ఇప్పటివరకు 188 మందిని అరెస్ట్ చేశారని తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు. పలువురు నిందితుల పేర్లను చదివి వినిపించారు.ఎవరినీ ఉపేక్షించబోమని, టీడీపీ పార్టీ నేతలు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. రుణగ్రస్తుల ప్రయోజనాలు కాపాడానికి, నిందితులను కఠినంగా శిక్షించేవిధంగా చట్టాన్ని కఠినతరం చేస్తామన్నారు.

దీనిపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు మాట్లాడుతున్నంత సేపు కూడా వైసీపీ సభ్యులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ సభలో గందరగోళం సృష్టించారు. వారి అరుపులు కేకల మధ్యనే చంద్రబాబు మాట్లాడారు. ప్రతిపక్ష నేత రెచ్చగొట్టాలే ప్రయత్నిస్తున్నారంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Chandrababu Naidu Fires on YSRCP Mla's In Assembly

సీఎం మాట్లాడుతున్న సమయంలో వారి స్థానాల్లో ఉండి అభ్యంతరం తెలపాలే తప్ప ముఖ్యమంత్రిపైకి దాడి చేసేలా దూసుకురావడం సిగ్గుచేటన్నారు. సభా సంప్రదాయాల ప్రకారమే సభ నడుస్తుంది తప్ప వారికిష్టం వచ్చినట్లు నడవదన్నారు. అసెంబ్లీ వైకాపా సభ్యుల తీరును ప్రజలు చూస్తున్నారని, వారికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.

ఇది ప్రజాస్వాయ్యం, ప్రజాస్వామ్య పద్ధతిలో సభ నడవాల్సిందిగా కోరారు. మీరు చెప్పినట్టే సభలో డిక్టేట్ చేయాలంటే అది మా వల్ల కాదన్నారు. ఇంతవరకు ఇలాంటి సభలో జరగలేదన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అన్ రూలింగ్‌లా తయారయ్యారని, ఇది ఎంత మాత్రం మంచిపద్ధతి కాదన్నారు.

ఇది సభ్యత కాదని, పోయిన సభలో కూడా ఏ విధంగా బిహేవ్ చేశారో చూశారుగా అంటూ స్పీకర్ కోడెలతో అన్నారు. అసెంబ్లీలో మీరు ఏది అనుకుంటే అది జరాగాలా? అంటూ ప్రతిపకక్ష వైసీపీ సభ్యులను ఉద్దేశించి అన్నారు. హౌస్‌లో మీ ఇష్టప్రకారం జరగదన్న చంద్రబాబు నోరు పారేసుకుంటే మంచింది కాదని సూచించారు.

తాను ఏడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ముఖ్యమంత్రిగా, రెండుసార్లు ప్రతిపక్ష నేతగా సభలో వ్యవహరించానని... సభలో ఇలాంటి దురదృష్టకర ఘటన ఎన్నడూ చూడలేదని చంద్రబాబు అన్నారు. కాల్‌మనీ వ్యవహారంపై చర్చ జరిగితే తమ బండారం బట్టబయలు పడుతుందనే వైకాపా సభ్యులు అడ్డుపడుతున్నారని ఆరోపించారు.

ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాయని, ఏ సభలో ఇంత దారణమైన రాజకీయాలు జరగలేదన్నారు. వీళ్లా ఎమ్మెల్యేలు, వీళ్ల కంటే బజారు రౌడీలే నయమన్నారు. సభ అంటే గౌరవం లేదన్నారు. సభాపతిని కోరుతూ మీరే చెప్పండి ఒక ముఖ్యమంత్రిపైకే దౌర్జన్యం చేసే పరిస్థికి వచ్చారంటే వీరు ఏరకంగా ఉన్నారో చూడండన్నారు.

మీరు డౌన్ డౌన్ అంటే నేను వెళ్లిపోతున్నానని అనుకుంటున్నారేమో, మీకు మైకు ఇచ్చినప్పుడే మాట్లాడండి అంతే తప్ప నోటికి ఎంత మాట వస్తే అలా మాట్లాడటం కుదరదన్నారు. కాల్‌మనీ వ్యవహారంలో ప్రభుత్వం స్పష్టంగా ఉందన్నారు. కాల్‌‌మనీ కేసులో ఇరుక్కుంది వీరేనని, భయపడిపోయి వారిని కాపాడేందుకు ఇలా మాట్లాడుతున్నారన్నారు.

హుందాగా సభకు రమ్మని కోరిన చంద్రబాబు కాల్‌మనీ కేసులో ఎంతటి వారున్నా వదిలిపెట్టబోమన్నారు. ఒకానొక సందర్భంలో సహనం కోల్పోయిన చంద్రబాబు ఈ హౌజ్‌లో దౌర్జన్యం చేయడానికి నా ముందుకు వస్తారా? అంటూ వైసీపీ సభ్యులపై మండిపడ్డారు.

వైసీపీ సభ్యులు గందరగోళం సృష్టించిన క్రమంలో స్పీకర్ కలగజేసుకుని ముఖ్యమంత్రి స్థానం వద్దకు వెళతారా? అంటూ ప్రశ్నించారు. మీకు సమయంమిస్తాం అప్పడే మీరు మాట్లాడాలి. ముఖ్యమంత్రి మీదకు దాడికి వెళతారా? అంటూ ప్రశ్నించారు. సభ్యులు కూర్చోవల్సిందిగా కోరారు.

English summary
Chandrababu Naidu Fires on YSRCP Mla's In Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X