కేసీఆర్ మా ఆత్మీయ అతిథి, ఏదో ఇస్తారని మోడీని పిలవలేదు: చంద్రబాబు

అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో ఎవరితోనూ అమర్యాదగా ప్రవర్తించొద్దని, ఎవరికీ లోటు రానివ్వద్దని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. అమరావతి శంకుస్థాపన మహోత్సవానికి సర్వం సిద్ధమైంది.

ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు సభాప్రాంగణంలోని ఏర్పాట్లను పరిశీలించారు. ముందు బ్లాకుల్లోని కుర్చీల్లో కూర్చోని ప్రధాన వేదికతో పాటు, సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసులు, ఉన్నాతాధికారులకు కొన్ని సూచనలు చేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ మా ఆత్మీయ అతిథి అని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలు కూడా అన్నదమ్ములాంటివని అన్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం ఓ చారిత్రక ఘట్టం అని పేర్కొన్నారు.

Chandrababu Naidu fires over Ys jagan for not attending amaravati foundation ceremony

అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిలను ఆహ్వానించామన్నారు. అమరావతి శంకుస్థాపనకు ప్రధాని నరేంద్రమోడీని అతిథిగా పిలిచామే తప్ప, ఆయనేదో ఇస్తారని ఆశించి పిలవలేదని ఆయన అన్నారు. మన ప్రతిపక్ష నాయకుడిని పిలిచినా రానంటున్నాడని
తెలిపారు.

ఉద్దండరాయుని పాలెంలో అక్టోబర్ 22(గురువారం)న అమరావతి శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించి పనులన్నీ పూర్తయ్యాయి. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యేందుకు విదేశాల నుంచి రాయబారులు, పారిశ్రామిక వేత్తలు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటున్నారు.

రాజధాని శంకుస్థాపన రోజున ఏపీ అభివృద్ధికి తొలి అడుగు పడనుంది. గురువారం ఉదయం 9 గంటలకు విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో జపాన్‌, ఏపీ ప్రభుత్వాలు ఎంవోయూ కుదుర్చుకోనున్నాయి. ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఏపీలో పెట్టుబడులపై జపాన్ మంత్రి యోసుకేతో చంద్రబాబు ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది.

రాజధాని అమరావతి శంకుస్థాపన ఏర్పాట్లన్నీ పూర్తవడంతో శంకుస్థాపన జరిగే ప్రాంతంలో సందర్శకుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. అమరావతి రాజధానికి సమయం దగ్గర పడుతుండటంతో సామాన్యులు, ప్రముఖులు తరలి వస్తున్నారు. అయితే, కేంద్ర నిఘా సంస్థ, ప్రధాని ప్రత్యేక భద్రతా సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు.

దీంతో ఆంక్షలు విధించారు. సందర్శకులకు అనుమతి లేదని ప్రకటించారు. పనులన్నీ పూర్తి కావటంతో బందోబస్తు నిర్వహణపై పోలీసు యంత్రాంగం దృష్టి సారించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+