తారకరత్న కుమార్తెకు ఫోన్ నెంబరు ఇచ్చిన చంద్రబాబునాయుడు
తారకరత్న చిన్న కర్మ కూడా తండ్రి చేతులమీదగానే జరగడం, చితికి ఆయనే నిప్పంటిచడంతో పెదకర్మ కూడా తండ్రి మోహన్ కృష్ణ స్వయంగా జరిపించారు.
కార్డియాక్ అరెస్ట్ కి గురై మృతిచెందిన తారకరత్న దశదినకర్మ హైదరాబాద్ లో జరిగింది. కుటుంబ సభ్యుల అశ్రునయనాల మధ్య సాంప్రదాయబద్దంగా కార్యక్రమాన్ని ముగించారు. అయితే ఈ దశదినకర్మకు సంబంధించిన ఒక పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ పోస్టర్లో తారకరత్న తల్లిదండ్రుల పేర్లు అంటే మోహనకృష్ణ -శాంతి దంపతుల పేర్లు లేవు. దీంతో వారు ఈ కార్యక్రమానికి హాజరవరనే ప్రచారం జరిగింది.

తండ్రే స్వయంగా జరిపించారు
తారకరత్న చిన్న కర్మ కూడా తండ్రి చేతులమీదగానే జరగడం, చితికి ఆయనే నిప్పంటిచడంతో పెదకర్మ కూడా తండ్రి మోహన్ కృష్ణ స్వయంగా జరిపించారు. హైదరాబాద్ హైదరాబాదులో ఉన్న ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో కార్యక్రమం జరిగింది. నందమూరి బాలకృష్ణ, విజయసాయిరెడ్డి సారథ్యం వహించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సహా కుటుంబ సభ్యులందరూ హాజరై అలేఖ్య రెడ్డి, ఆమె పిల్లలకు తామున్నామనే భరోసా ఇచ్చారు.

ఫోన్ నెంబరు ఇచ్చిన చంద్రబాబునాయుడు
నందమూరి తారకరత్న భార్యతో, పిల్లలతో నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అలేఖ్య రెడ్డికి తాను ఉన్నానని అభయం ఇవ్వటమే కాదు అలేఖ్య రెడ్డి, తారకరత్న పతుల పెద్ద కుమార్తె నిష్కతో కూడా చంద్రబాబు పక్కనే కూర్చోబెట్టుకుని మాట్లాడారు. అన్ని విషయాల్లో ఒక పెద్దగా తాను ఉంటానని, ఎటువంటి అవసరం పడినా వెంటనే తనను సంప్రదించాలని ఫోన్ నెంబరు ఇచ్చారు.

ఫొటోను షేర్ చేసిన అలేఖ్యరెడ్డి
తారకరత్న మరణాన్ని తలుచుకుంటూ ఆయన భార్య అలేఖ్యరెడ్డి ఇటీవలే సోషల్ మీడియాలో భర్తతో దిగిన ఫొటోను షేర్ చేశారు. తారకరత్నకు బాలకృష్ణ కారణంగా సన్నిహిత సంబంధాలున్నాయి. అమ్మా బంగారు అనే నీ పిలుపు ఎప్పుడు వినిపిస్తుందా? అని ఎదురు చూస్తున్నానని, ఇదంతా ఒక కల అయితే బాగుంటుందని అలేఖ్యరెడ్డి సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.












Click it and Unblock the Notifications