నారా భువనేశ్వరి రియలైజ్ అయ్యారు
Jogi Ramesh: ఏపీలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కుప్పం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తాను పోటీ చేస్తానంటూ చంద్రబాబు నాయుడి భార్య నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తోన్నాయి. రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.
35 సంవత్సరాలుగా చంద్రబాబు రాష్ట్ర ప్రజల కోసం అవిశ్రాంతంగా కష్టపడుతున్నారని నారా భువనేశ్వరి అన్నారు. ఈ సారి ఆయనకు విశ్రాంతి ఇచ్చి, కుప్పం నుంచి తాను పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. తనకు ఎంతమంది మద్దతు ఇస్తారంటూ ప్రశ్నించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

టీడీపీ కుప్పం అభ్యర్థిని నేనే.. నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు..!!#NaraBhuvaneswari #Chandrababu #ChandrababuNaidu #Kuppam #NijamGelavali #AndhraPradesh #ApElections2024 #Oneindiatelugu pic.twitter.com/cw0F4yytqU
— oneindiatelugu (@oneindiatelugu) February 21, 2024
భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలపై కొందరు మంత్రులు, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందించారు. జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో సెటైర్లు సంధించారు. బాబు గారి కుర్చీని నారా భువనేశ్వరి గారు మడతేసేసింది.. అంటూ ఎద్దేవా చేశారు.
బాబు గారి కుర్చీని
— Ambati Rambabu (@AmbatiRambabu) February 21, 2024
భువనేశ్వరి గారు మడతేసేసింది !@ncbn @naralokesh
భువనేశ్వరిపై కామెంట్స్‌పై గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మాట్లాడారు. చంద్రబాబు ఓటమిని భువనేశ్వరి ముందుగానే పసిగట్టారని, అందుకే భర్తకు విశ్రాంతి ఇచ్చి తాను పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. ప్రజల నాడి ఏమిటనేది భువనేశ్వరికి స్పష్టంగా తెలిసిపోయిందని చెప్పారు.

రాష్ట్రం మొత్తం మీదే కాదు.. తన సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా టీడీపీ, చంద్రబాబు ఓడిపోతారనే విషయం అందరికీ తెలుసునని, అదే విషయాన్ని భువనేశ్వరి అంగీకరించారని చెప్పారు. 35 సంవత్సరాల పాటు కుప్పం ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబు అక్కడి ప్రజలకు ఏమీ చేయలేదని గుర్తించారని అన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తుందని జోగి రమేష్ అన్నారు. వైనాట్ 175 అనే నినాదాన్ని నిజం చేస్తామని చెప్పారు. కుప్పం సహా రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుచుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications