చంద్రబాబు సంచలనం: సండ్రకు గ్రీన్ సిగ్నల్, పార్టీ మారిన సాయన్నపై ప్రతీకారం
హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. టీటీడీ పాలక మండలి కాల పరిమితిని మరో ఏడాది పొడిగిస్తూ దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనుంది.
టీడీపీ సీనియర్ నేత, తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి చైర్మన్‌గా 19తో కూడిన పాలక మండలి గతేడాది మే 2న పదవీ ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. ఈ 19 మందిలో తెలంగాణకు చెందిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు ఆరోజు చోటు కల్పించారు.
అందులో ఒకరు ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కాగా మరొకరు సికింద్రాబాదు పరిధిలోని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న. అయితే తెలంగాణలో టీఆర్ఎస్ చేపట్టిన 'ఆపరేషన్ ఆకర్ష్'లో భాగంగా సాయన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో సైకిల్ దిగి కారెక్కేశారు.

తెలంగాణ టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న సాయన్న పార్టీ మారడం చంద్రబాబును షాక్‌కు గురి చేసింది. అయితే ఆ నాడు తనకు తగిలిన షాక్‌కు ప్రతీకారంగా చంద్రబాబు తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ బోర్డులో చైర్మన్ చదలవాడతో పాటు మిగిలిన సభ్యులందరి పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగించేందుకు సరేనన్న చంద్రబాబు సాయన్న పదవీ కాలాన్ని పొడిగించేందుకు మాత్రం ఆయన ససేమిరా అన్నారు.
దీంతో తెలంగాణ టీడీపీలోనే కొనసాగుతున్న సండ్ర వెంకటవీరయ్యను బోర్డులో కొనసాగించేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, సాయన్నను బోర్డు నుంచి తొలగించి ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
-
ఈ నెల 30 నుంచి తిరుమలలో -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు












Click it and Unblock the Notifications