వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుకు మరో చిక్కు.. ! లింగమనేని ఇంటిపై రైతుల ఫిర్యాదు.. ఆందోళన.. !

|
Google Oneindia TeluguNews

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉంటున్న ఇంటిని మరో వివాదం చుట్టుముట్టింది..ఆయన నివాసానికి వెళ్లేందుకు నిర్మించిన రోడ్డు మార్గానికి ఒప్పందంతో రైతుల భూములు తీసుకున్నారని, అవి తిరిగి తమకు ఇచ్చివేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తమ భూములు తమకు ఇప్పించాలంటూ స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డిని రైతులు ఆశ్రయించారు..దీంతో ఎమ్మెల్యే రైతులను వెంటబెట్టుకుని భూములను పరీశీలించారు.

చంద్రబాబు ఇంటి రోడ్డు వివాదం...

చంద్రబాబు ఇంటి రోడ్డు వివాదం...

అమరావతిలో మాజి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉంటున్న ఇళ్లు అక్రమ నిర్మాణం అంటూ ఇప్పటికే వివాదం నెలకొన్న విషయం తెలిసిందే...దీంతో ఆ ఇంటి నిర్మాణంపై వివరణ ఇవ్వాలంటూ అధికారులు నోటీసులు ఇంటికే అతికించడం తెలిసిందే... ఇక తాజగా చంద్రబాబు ఉంటున్నఇంటితో పాటు ఆ ఇంటికి వెళ్లే రహాదారిపై కూడ మరో వివాదం నెలకొంది.. చంద్రబాబు నాయుడు ఇంట్లోకి వస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి రోడ్డు కోసం రైతుల వద్ద ఒప్పందం ప్రకారం భూములు తీసుకున్నారని, ఒప్పందం అయిపోయిన నేపథ్యంలో తిరిగి తమ భూములను తమకు ఇచ్చి వేయాలని వారు కోరుతూ స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణా రెడ్డికి పిర్యాధు చేశారు.

ఒప్పందం ప్రకారం భూముల సేకరణ

ఒప్పందం ప్రకారం భూముల సేకరణ

చంద్రబాబు నాయుడు ఉంటున్న ఇంటి దారి కోసం రైతుల వద్ద భూమిని సేకరించారు..అయితే రోడ్డు నిర్మాణం సమయంలో చంద్రబాబు శాశ్వత నిర్మాణం పూర్తయిన అనంతరం తిరిగి భూములను ఇచ్చివేస్తామని స్థానిక ఆర్డీవోతోపాటు ఎమ్మార్వో తోపాటు గ్రామ కార్యదర్శీ సంతంక చేసిన ఒప్పంద పత్రాన్ని 2015లో రాసించారని భూములను ఇచ్చిన, రైతులు శేషగిరిరావు, దాసరి సాంబశివరావులు తెలిపారు..ఇక చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోయిన తర్వాత తమ భూములు తమకు అప్పగించాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డిని కలిశారు..

భూములను పరీశీలించిన ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణా రెడ్డి

భూములను పరీశీలించిన ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణా రెడ్డి

దీంతో ఆళ్ల రామక్రిష్ణా రెడ్డి రైతులతో కలసి ఆదివారం ఉదయం రోడ్డు నిర్మించిన ప్రాంతాన్ని పరిశీలించారు ..ఈనేపథ్యంలోనే రైతులకు సరైన న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు..తమ రాజన్న రాజ్యమని రైతులు ఎవరు నష్టపోకుండా ఉండేందుకు చర్యలు చేపడతామని ఆయన అన్నారు..కాగా భూములు కోల్పోయిన రైతులు సీఆర్డీఏ అధికారులతోపాటు జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందిస్తామని తెలిపారు.

English summary
The house where the former chief minister Chandrababu Naidu is staying has surrounded Another controversy.the Farmers are demanding for land which was given built for road to chandra babu naidu house.and met local MLA ramakrishna Reddy on sunday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X