వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపిని భారత సిలికాన్ వ్యాలీ చేస్తాం: సింగపూర్‌లో చంద్రబాబు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

సింగపూర్: స్ఫూర్తిమంతమైన సమర్థ నాయకత్వంతోనే సమతుల అభివృద్ధి సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. తాము అందరికీ ప్రయోజనకరమైన భూసమీకరణ విధానం తీసుకొచ్చామని, భవిష్యత్తులో తమ భూములకు విలువ వస్తుందన్న నమ్మకంతో రైతులు 33వేల ఎకరాల భూమిని రాజధానికి ఇచ్చారని చెప్పారు.

సింగపూర్‌ ప్రభుత్వం రాజధాని నిర్మాణంలోనూ భాగస్వామి అవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. వాణిజ్యానుకూల రాష్ట్రాల జాబితాలో రెండోస్థానంలో నిలిచిన తాము త్వరలోనే ఎవరూ అందుకోని ఎత్తుకు ఎదుగుతామని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను భారతదేశ సిలికాన్‌ వ్యాలీగా తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అందుకోసం త్వరలో నవకల్పన నిధి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

అమరావతి నిర్మాణంపై చర్చించడానికి సింగపూర్‌ వెళ్లిన చంద్రబాబునాయుడు తన రెండో రోజు పర్యటనలో తీరికలేకుండా గడిపారు. ముఖ్యమంత్రి ఒక పక్క పలు కార్యక్రమాల్లో పాల్గొంటూనే మరో పక్క సింగపూర్‌లో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏషియన్ స్టడీస్ సమావేశంలో మాట్లాడారు. ‘మాది కొత్త రాష్ట్రం. అన్ని విధాలా అభివృద్ధి చేయాల్సి ఉంది. ఈ కృషిలో అంతా కలిసి రావాలి' అని చంద్రబాబు కోరారు.

శిక్షణ, సామర్ధ్యం పెంపు, వ్యాపార సరళీకృత విధానం, ఆకర్షణీయ నగరాలు తదితర అంశాల్లో కలిసి పనిచేయాలని ఈ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్, సింగపూర్ ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఈ భేటీ అనంతరం ఈశ్వరన్ ముఖ్యమంత్రికి విందు ఇచ్చారు. ఆర్ధిక వేత్తలు, మేథావులతో భేటీ అయిన సిఎం అనంతరం సింగపూర్ మీడియాతో మాట్లాడారు.

సౌత్ ఏషియన్ స్టడీస్ సమావేశంలో అంబాసిడర్ గోపీనాధ్ పిళ్లై స్వాగతం పలుకుతూ ఆంధ్రాలో, ఇండియాలో ఐటి రంగం విస్తరణకు చంద్రబాబు ఎనలేని కృషి చేశారని అన్నారు. వచ్చే ఏడాది ఐఎస్‌ఎఎస్ నిర్వహించే సౌత్ ఏషియా డయాస్పోరా మీట్‌కు ఆహ్వానిత రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటని వెల్లడించారు.

చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని, రెండంకెల వృద్ధి సాధించే సామర్ధ్యంతో ముందుకు వెళ్తోందని అన్నారు. 2050 నాటికి అమెరికా, చైనా, ఇండియా ఈ మూడు ఆర్ధిక వ్యవస్థలు ముందంజలో ఉంటాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నో లాభసాటి అంశాలు ఉన్నాయని, ఐటి రంగం, నాలెడ్జి ఎకానమి ఉందని అలాగే 974 కిలోమీటర్లు సముద్ర తీరం అద్భుతమైన వనరు అని పేర్కొన్నారు. ఎపిని లాజిస్టిక్ హబ్‌గా రూపొందించవచ్చని చెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు

స్ఫూర్తిమంతమైన సమర్థ నాయకత్వంతోనే సమతుల అభివృద్ధి సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

తాము అందరికీ ప్రయోజనకరమైన భూసమీకరణ విధానం తీసుకొచ్చామని, భవిష్యత్తులో తమ భూములకు విలువ వస్తుందన్న నమ్మకంతో రైతులు 33వేల ఎకరాల భూమిని రాజధానికి ఇచ్చారని చెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు

సింగపూర్‌ ప్రభుత్వం రాజధాని నిర్మాణంలోనూ భాగస్వామి అవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. వాణిజ్యానుకూల రాష్ట్రాల జాబితాలో రెండోస్థానంలో నిలిచిన తాము త్వరలోనే ఎవరూ అందుకోని ఎత్తుకు ఎదుగుతామని ధీమా వ్యక్తం చేశారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ను భారతదేశ సిలికాన్‌ వ్యాలీగా తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అందుకోసం త్వరలో నవకల్పన నిధి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

చంద్రబాబు

చంద్రబాబు

అమరావతి నిర్మాణంపై చర్చించడానికి సింగపూర్‌ వెళ్లిన చంద్రబాబునాయుడు తన రెండో రోజు పర్యటనలో తీరికలేకుండా గడిపారు.

సముద్ర ఎగుమతుల్లో ఇప్పటికే రెండో స్థానంలో ఉన్నామంటూ త్వరలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంటామని అన్నారు. విస్తీర్ణంలో సింగపూర్ కంటే ఆంధ్రప్రదేశ్ 250 రెట్లు పెద్దదని, జనాభాలో 10 రెట్లు పెద్దదని పేర్కొన్నారు. అన్ని రకాల ఖనిజ సంపద సమృద్ధిగా ఉందని చెప్పారు.

ఆప్టిక్ ఫైబర్ ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటినీ కలుపుతామని చెప్పారు. ఈ సందర్భంగా సభలో పాల్గొన్న ప్రముఖులు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు బదులిచ్చారు. వెంచర్ క్యాపిటల్ ఫండ్
స్టార్టప్‌ల కోసం వెంచర్ క్యాపిటల్ ఫండ్ ప్రారంభించనున్నట్టు చంద్రబాబునాయుడు చెప్పారు. అలాగే ఎంటర్ ప్రెన్యూర్‌కు మంచి ప్రోత్సాహాన్ని అందజేస్తామని అన్నారు.

స్టార్టప్‌ల కోసం ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అన్ని అనుమతులు 21 రోజుల్లో ఇస్తున్నామని, భారీ ఎత్తున వనమహోత్సవాన్ని నిర్వహిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ను ఎడ్యుకేషనల్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. తనకో పరిశ్రమ ఉందని, గత ఐదేళ్లుగా విద్యుత్ కొరతతో ఇబ్బందులు పడ్డామని, కానీ తాము అధికారంలోకి రాగానే ఆ సమస్యను అధిగమించామని అన్నారు.

43 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని, ఇ పాస్ వినియోగించి పౌరసరఫరాల వ్యవస్థలో వెయ్యి కోట్ల ప్రజాధనాన్ని సద్వినియోగం చేశామని చెప్పారు. రాష్ట్రంలో విపత్తుల నిర్వహణపై ఒక మాన్యువల్ తెస్తామని చంద్రబాబు తెలిపారు. ఎప్పుడు ఎలాంటి విపత్తులు వాటిల్లాయో, వాటిని ఏ విధంగా అధిగమించామో పొందుపరుస్తామని చెప్పారు.

భారత్‌లో రక్షణకు పెద్ద ఎత్తున పోలీసులను వినియోగించడం తప్పనిసరిగా మారిందని అన్నారు. భారత్‌లో విద్యాబోధనలో నాణ్యత పెంచాల్సి ఉందని, అలాగే వారసత్వ సంపద పరిరక్షణకు చర్యలు చేపట్టామని తెలిపారు. సింగపూర్‌లో పారిశ్రామికవేత్తలు అంతా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి చూడాలని, పెట్టుబడి అవకాశాలను అన్వేంచుషించుకోవాలని చంద్రబాబు సూచించారు.

English summary
Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu would tomorrow invite Singapore's Prime Minister for the foundation laying ceremony of the state's new capital Amaravati slated to be held on 'Vijaya Dasami' next month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X