జగన్ నవరత్న హామీలతో చంద్రబాబు బెంబేలు: భూమన ఎద్దేవా
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్న హామీలతో టీడీపీ నేతల్లో వణుకు మొదలైందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు.
హైదరాబాద్ : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్న హామీలతో టీడీపీ నేతల్లో వణుకు మొదలైందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు.
బుధవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. 'అన్నొస్తున్నాడు ప్రకటనతో చంద్రబాబు బెంబేలెత్తిపోతున్నారు. కిడ్నీ బాధితులకు పెన్షన్ ఇవ్వాలన్న నిర్ణయం నవరత్న హామీనే. ..' అని వ్యాఖ్యానించారు.

చంద్రబాబుపై దండయాత్రకు ప్రజలు సిద్ధమవుతున్నారని, నంద్యాల ప్రజలు టీడీపీకి గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉందని, జనం తాట తీసే బెల్ట్ షాపులు ఏర్పాటు చేసింది చంద్రబాబే..' అని అన్నారు.












Click it and Unblock the Notifications