వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్మార్ట్‌సైకిల్ ప్రారంభం:సైకిల్‌పై ఛాంబర్‌కు వెళ్ళిన చంద్రబాబు

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం నాడు సచివాలయంలోని తన కార్యాలయానికి సైకిల్‌పై వెళ్ళారు. సచివాలయంలో స్మార్ట్ సైకిళ్ళను చంద్రబాబునాయుడు ప్రారంభించారు.

చంద్రబాబునాయుడు స్మార్ట్‌ సైకిళ్ళను ప్రారంభించిన అనంతరం తన ఛాంబర్‌కు సైకిల్‌పై వెళ్ళారు. . సచివాలయం 2వ బ్లాక్ నుంచి తన కార్యాలయం వరకు సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళారు. సచివాలయంలో స్మార్ట్ సైకిళ్లను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఓ సైకిల్ ను తొక్కుకుంటూ వెళ్ళారు.

కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా స్మార్ట్‌ సైకిళ్ల వ్యవస్థను తొలిసారిగా అమరావతిలో ప్రవేశపెట్టారు. జర్మనీ నుంచి ఇప్పటికే సచివాలయానికి 30 సైకిళ్లు చేరాయి. వెలగపూడి సచివాలయంలో ప్రయోగాత్మకంగా వీటిని అమలు చేస్తున్నారు.

Chandrababu naidu Launches Smart Cycles in Amaravati

మాస్టర్ ప్లాన్ ప్రకారం సీఆర్‌డీఏ పరిధిలో సైకిల్ సవారీకి ప్రత్యేకంగా ట్రాక్‌లను కూడా ఏర్పాటు చేశారు. అంతేగాక సచివాలయం ఆవరణ లోపల రెండు స్మార్ట్‌ సైకిల్‌ స్టేషన్లను ఏర్పాటు చేశారు.

అలాగే వాహనాల పార్కింగ్‌ వద్ద మరో స్టేషన్‌ ఏర్పాటుచేశారు. ప్రతి స్టేషన్ లో 10 సైకిళ్ళను అందుబాటులో ఉంచారు. సైకిల్‌ తీసుకునే వారికి ప్రత్యేకంగా స్వైపింగ్‌ కార్డు, పాస్‌వర్డ్‌ కేటాయిస్తారు. ఈ పాస్‌వర్డ్‌తోనే సైకిళ్ళు తెరుచుకుంటాయి.

పని ముగించుకున్న తర్వాత తీసుకున్న సైకిల్‌ను మూడు స్టేషన్లలో ఎక్కడైనా అప్పజెప్పి వెళ్ళే అవకాశం కల్పించారు. ఎల్లాయిడ్‌, అల్యూమినియంతో తయారు చేయబడిన ఈ కొత్త సైకిళ్లు వర్షంలో తడిసినా తుప్పు బట్టే అవకాశం లేదు. అలాగే ఈ సైకిళ్ళకు మూడు గేర్లు ఉంటాయి.

English summary
AP CM Chandrababu naidu launched Smart Cycles as a part of pollution free Amaravathi on Wednes day. he has introduced smart cycles in secretariat as a pilot project for the convenience of visitors and employees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X