చైనాలో చాక్లెట్స్ కొనలేకపోయాం: 2కిలోలు తగ్గిన బాబు, తిండి తినలేక..

హైదరాబాద్: ఆరు రోజుల చైనా పర్యటనలో తాను రెండు కిలోల బరువు తగ్గానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శనివారం అన్నారు. చైనాలో నూనె లేని తేలికైన వస్తువులను ఆహారంగా తీసుకున్నానని చెప్పారు.

అందువల్లే తాను రెండు కిలోలు తగ్గినట్లు చెప్పారు. తనతో పాటు అందరూ బరువు తగ్గారన్నారు. చైనా ఆహారం బాగుందని కితాబిచ్చారు. ఆరు రోజుల పర్యటనలో నిమిషం కూడా తీరిక లేకుండా చైనా ప్రతినిధులతో సమావేశమయ్యామని, ఉరుకులు పరుగులు పెట్టామన్నారు.

 Chandrababu Naidu lose 2 KGs weight

ఇలాంటి చోట్లకు వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు చాక్లెట్లు కొంటుంటారని, తమ అధికారులకు కనీసం ఆ వెసులుబాటు కూడా లేకుండా పోయిందని చెప్పారు. కాగా, తాను మూడు కిలోల బరువు తగ్గానని మంత్రి అచ్చెన్న్ాయుడు చెప్పారు. ఉప్పూకారం లేని తిండి తినలేకపోయినట్లు చెప్పారు.

విదేశీ ఒప్పందాలు జనం ముందుంచండి: వైయస్సార్ కాంగ్రెస్

విదేశీ పర్యటనలో భాగంగా పలు సంస్థలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో చేసుకున్న ఒప్పందాలను ప్రభుత్వం ప్రజల ముందుంచాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాద రావు డిమాండ్‌ చేశారు. శనివారం లోట్‌సపాండ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పారదర్శక పాలన అందిస్తామని చెబుతోన్న చంద్రబాబు ఎంఓయూలను ప్రజల ముందుంచాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+