చెమటలు కక్కిన పారికర్, ఇదీ ఏపీ: బాబు(పిక్చర్స్)
విజయవాడ: సామాజిక భద్రతా పథకాలు మనిషి జీవితానికి భరోసా ఇస్తాయని, అందరూ సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం అన్నారు. ప్రధాని సురక్ష బీమా యోజన, జీవన జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన పథకాలను ఆయన బెజవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఒకేసారి మూడు పథకాలు అందుబాటులోకి రావడం కొత్త అధ్యాయమన్నారు. కాగా, శనివారం అయిదు గంటల్లోపు ఏపీలో జీవనజ్యోతి బీమా యోజనకు రూ.4.71 లక్షలు, సురక్ష యోజనకు రూ.19.81 లక్షలు, అటల్ పెన్షన్‌కు 821 మంది నమోదు చేసుకున్నారు.
సంక్షేమ పథకాలను ఇంటి వద్దకే తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని చంద్రబాబు చెప్పారు. జన్ ధన్ ఖాతాల్లోని నగదును ఎక్కడి నుంచైనా తీసుకునేలా కృష్ణా జిల్లాలో ప్రయోగాత్మకంగా పథకం అమలు చేస్తున్నామన్నారు. ఇంటి వద్దే పింఛన్లు, పంపిణీకి శ్రీకారం చుట్టారన్నారు. సాంకేతికతను ఉపయోగించుకొని పారదర్శకతకు పెద్ద పీట వేస్తున్నామన్నారు.
తుమ్మలపల్లి కళాక్షేత్రాన్ని చూపిస్తూ.... కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ తొలిసారి రాజధాని ప్రాంతానికి వచ్చారని, దీన్ని చూస్తే రాష్ట్ర పరిస్థితి అర్థమవుతుందని, రాజధానిని మొదటి నుండి నిర్మించుకోవాలని కేంద్రం సహకారం అవసరమని చంద్రబాబు అన్నారు.

చంద్రబాబు, పారికర్
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ ప్రభుత్వం ఒకటే ఆలోచన చేస్తున్నాయని, పేదలకు న్యాయం చేయడం, వారి కుటుంబాలు ఆనందంగా జీవించడం, వారి కష్టాలు తీరడమే ఆ ఆలోచన అని చంద్రబాబు చెప్పారు.

చంద్రబాబు, పారికర్
అందుకోసమే గతంలో రూ.200గా ఉన్న పింఛన్‌ను రూ.1000లకు, వికలాంగులకు రూ.1500లకు పెంచి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోందని, మరోవైపు కేంద్రం కూడా ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన పేరుతో మూడు పథకాలను తెస్తోందన్నారు.

చంద్రబాబు, పారికర్
శనివారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.

చంద్రబాబు, పారికర్
పేదల జీవితాలకు, వారిని నమ్ముకున్న కుటుంబ సభ్యులకు భరోసా కల్పిస్తామన్నారు. పేదలు అనాథలు కాదని, పథకాలు కింది స్థాయిలోకి వెళితేనే వాటికి సార్థకత చేకూరుతుందని ఆయన చెప్పారు.

చంద్రబాబు, పారికర్
రాష్ట్ర ప్రభుత్వం తరఫున అసంఘటిత కార్మికులకు ఒక బీమా పథకం, డ్రైవర్లకు ఒక బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. అతి తక్కువ మొత్తాన్ని చెల్లించి కారు, లారీ వంటి ఏ రకమైన వాహనాన్ని నడిపే డ్రైవర్లైనా బీమా ప్రయోజనాన్ని పొందొచ్చన్నారు.

చంద్రబాబు, పారికర్
కేంద్రమంత్రి మనోహర్ పర్రీకర్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ప్రధాని మోడీసామాన్య జనానికి ప్రయోజనం కల్పించే పలు చర్యలు తీసుకున్నారని అన్నారు. నెలకు ఒక్క రూపాయి చెల్లిస్తే బీమా సదుపాయం, అలాగే తక్కువ ప్రీమియంతో వృద్ధాప్యంలో పింఛన్ వంటి చరిత్రలో లిఖించదగ్గ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. జన్‌ధన్ పథకంతో పాటు ఈ పథకాలన్నీ సామాన్యుల చేతిలో త్రిశూలాల వంటివన్నారు.

చంద్రబాబు, పారికర్
కేంద్రాన్ని సాయం కోరడం కోసం ఏపీ సీఎం చంద్రబాబు ఒక అరుదైన అవకాశాన్ని వినియోగించుకున్నారు. ప్రత్యేకంగా సమావేశమై వారిని అర్ధించే కంటే, సందర్భాన్ని ఉపయోగించుకుని సాయం చేయక తప్పదని కేంద్రానికి పరోక్షంగా సూచించారు.

చంద్రబాబు, పారికర్
అంతకుముందు ప్రసంగించిన కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌కు ఏసీ లేని ఆడిటోరియంలో చమటలు పట్టాయి. దీంతో, చంద్రబాబు తన ప్రసంగంలో.. సార్.. ప్లీజ్ సీ దిస్ హాల్, దిసీజ్ ద క్యాపిటల్, ది సీజ్ ద ఆంధ్రప్రదేశ్. దీనిని పునాది స్థాయి నుంచి పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది, మీ సహకారం అవసరమన్నారు.

చంద్రబాబు, పారికర్
కళాక్షేత్రంలో ఏసీ కూడా లేకపోవడంతో ఎండలతో హాల్ అంతా వేడిగా, ఉక్కపోతతో ఉండటంతో మనోహర్ పారికర్ ప్రసంగిస్తున్న సమయంలో పలుసార్లు చమటలు తుడుచుకున్నారు.

చంద్రబాబు, పారికర్
మనోహర్ పారికర్‌ను ఉద్దేశించి ఇంగ్లీషులో మాట్లాడిన చంద్రబాబు పారికర్‌ను ప్రశంసించారు. గోవా ముఖ్యమంత్రిగా ఉండగా ప్రధాని మోడీ కోరిక మీద కేంద్ర కేబినెట్‌లో చేరారన్నారు. ఏపీలో రక్షణ శాఖకు చెందిన పలు ప్రాజెక్టుల గురించి ప్రస్తావిస్తూ వాటికి భూమిని కూడా మంజూరు చేశామని చెప్పారు.

చంద్రబాబు, పారికర్
మచిలీపట్నంలో రాడార్ టెస్టింగ్ సెంటర్ కోసం 50 ఎకరాలు అడిగారని, అది కూడా మంజూరు చేస్తామన్నారు. చివర్లో పారికర్‌కు రాజధాని దుస్థితిని వివరించారు. కేంద్రం ఆదుకుని, రాజధాని నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించాలని పారికర్‌కు చంద్రబాబు పరోక్షంగా సూచించారు. చంద్రబాబు ప్రసంగం ముగించి ఆసీనులైన వెంటనే చంద్రబాబుకు షేక్ హ్యాండ్ ఇచ్చి తన అండ ఉంటుందని చెప్పారు.












Click it and Unblock the Notifications