జీతాలివ్వలేని స్థితి: బాబు, మార్చొద్దని విహెచ్ ఆగ్రహం
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని, తమకు సాయం చేయాలని కేంద్రాన్ని కోరానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఢిల్లీలో చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని తాను కేంద్రమంత్రుల దృష్టికి తీసుకు వెళ్లానని చెప్పారు.
నారా చంద్రబాబు నాయుడు కేంద్రమంత్రు అరుణ్ జైట్లీ, ఉమా భారతిలతో భేటీ అయిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబుతో భేటీ అనంతరం ఉమా భారతి మాట్లాడుతూ... చంద్రబాబు ప్రస్తావించిన అంశాలను తాము ప్రధాని దృష్టికి తీసుకు వెళ్తామని చెప్పారు.

చంద్రబాబుపై విహెచ్ నిప్పులు
చంద్రబాబు నాయుడు పైన రాజ్యసభ సభ్యులు, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు నిప్పులు చెరిగారు. శంషాబాద్ విమానాశ్రయం పేరును మార్చవద్దని కోరారు.
ఆ విమానాశ్రయానికి ఉన్న రాజీవ్ గాంధీ పేరును తొలగిస్తే తాము ఒప్పుకునే ప్రసక్తి లేదన్నారు. కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు, నాయకుల మనోభవాలు దెబ్బతీయవద్దని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు నాయుడు ఘర్షణ వాతావరణం సృష్టించాలనుకుంటున్నారని ధ్వజమెత్తారు. అక్రమ భూముల స్వాధీనంపై కెసిఆర్ తొలి సంతకం పెట్టాలని కోరారు.












Click it and Unblock the Notifications