అందరూ మీలా పని చేస్తే దూసుకెళ్తుంది: బాబుపై ప్రణబ్, ‘హైకోర్టుపై చర్చ’

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరుపై ప్రశంసలు కురిపించారు. 'మీరు ప్రతి అంశంలో సానుకూల దృక్పథంతో ఉంటారు. అందరు ముఖ్యమంత్రులు మీలా పనిచేస్తే దేశం అభివృద్ధి దిశలో దూసుకెళ్తుంది' అని కొనియాడారు.

అంతేగాక, 'రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో తప్ప మిగతా సమయంలో అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. ఆ విషయంలో అందరికంటే మీరు ముందుంటారు' అని ప్రణబ్‌ముఖర్జీ చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గురువారం సాయంత్రం సీఎం చంద్రబాబు టిడిపి ఎంపీలతోపాటు రాష్ట్రపతిని కలిశారు. ఆయనకు శాలువాకప్పి, పుష్పగుచ్ఛం అందించి ఆగస్టు 12 నుంచి ప్రారంభమయ్యే కృష్ణా పుష్కరాలకు రావాలంటూ ఆహ్వానించారు.

ఇందుకు తప్పకుండా వచ్చేందుకు ప్రయత్నిస్తానని ప్రణబ్‌ హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ సందర్భంగానే ప్రణబ్‌ ముఖర్జీ ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరును మెచ్చుకున్నారు. విభజన తర్వాత రాష్ట్రం ఎదుర్కొంటున్నఆర్థిక ఇబ్బందుల్ని ముఖ్యమంత్రి రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లినట్లు సమావేశంలో పాల్గొన్న ఎంపీలు పేర్కొన్నారు.

ఢిల్లీ ప్రముఖులను పుష్కరాలకు ఆహ్వానించడానికి గురువారం ఢిల్లీకి చేరుకున్న సీఎం చంద్రబాబు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌, జాతీయ మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్తు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జేఎస్‌ ఖేహర్‌లను వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానపత్రాలు అందించారు.

హైకోర్టు విభజనకు కమిటీ?

చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ ఠాకూర్‌ను కలిసి కృష్టా పుష్కరాల ఆహ్వానం అందజేసినప్పుడు హైకోర్టు విభజన అంశం చర్చకు వచ్చినట్టు తెలిసింది. అత్యంత వివాదాస్పదంగా మారిన రాష్ట్ర హైకోర్టు విభజన కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసే ప్రతిపాదనపై చర్చ జరిగినట్లు సమాచారం.

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టును వీలున్నత త్వరగా విభజించాలని చేస్తున్న డిమాండ్ గురించి ప్రస్తావిస్తూ కమిటీ ఏర్పాటు ప్రతిపాదన వీరి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే, ఏపీ హైకోర్టును కొత్త రాజధానిలోనే ఏర్పాటు చేయాలని చంద్ర బాబు సూచించారని అంటున్నారు. రాజధాని నిర్మాణం ఇంకా ప్రారంభం కానందున ఉమ్మడి హైకోర్టును వెంటనే విభజించడం ఎలా సాధ్యమవుతుందని చంద్రబాబు ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

ప్రణబ్‌తో చంద్రబాబు

ప్రణబ్‌తో చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరుపై ప్రశంసలు కురిపించారు.

ప్రణబ్‌తో చంద్రబాబు

ప్రణబ్‌తో చంద్రబాబు

'మీరు ప్రతి అంశంలో సానుకూల దృక్పథంతో ఉంటారు. అందరు ముఖ్యమంత్రులు మీలా పనిచేస్తే దేశం అభివృద్ధి దిశలో దూసుకెళ్తుంది' అని కొనియాడారు.

ప్రణబ్‌తో చంద్రబాబు

ప్రణబ్‌తో చంద్రబాబు

అంతేగాక, 'రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో తప్ప మిగతా సమయంలో అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. ఆ విషయంలో అందరికంటే మీరు ముందుంటారు' అని ప్రణబ్‌ముఖర్జీ చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ప్రణబ్‌తో చంద్రబాబు

ప్రణబ్‌తో చంద్రబాబు

గురువారం సాయంత్రం సీఎం చంద్రబాబు టిడిపి ఎంపీలతోపాటు రాష్ట్రపతిని కలిశారు. ఆయనకు శాలువాకప్పి, పుష్పగుచ్ఛం అందించి ఆగస్టు 12 నుంచి ప్రారంభమయ్యే కృష్ణా పుష్కరాలకు రావాలంటూ ఆహ్వానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+