అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గణతంత్ర వేడుకలకు బాబు దూరం: కారణమిదే!, జెండా ఎగరేసిన గవర్నర్, భువనేశ్వరి హాజరు

|
Google Oneindia TeluguNews

అమరావతి: గణతంత్ర వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరుకాలేకపోయారు. దావోస్ నుంచి ఆయన గురువారం రాష్ట్రానికి బయలుదేరారు. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా ఆయన ప్రయాణిస్తున్న విమానం ఆలస్యమైంది.

Recommended Video

Republic Day 2018 : PM Modi Pays Tribute At Amar Jawan Jyoti

శుక్రవారం ఉదయం 7గంటలకు ఆయన అమరావతి రావాల్సి ఉండగా...అబుదాబిలో పొగమంచు కారణంగా విమానం ఆలస్యమైంది. దీంతో ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి జాతీయ జెండాను ఎగురవేశారు.

chandrababu naidu not able to attend republic day celebrations

అక్కడ ఉన్న సిబ్బందికి ఆమె మిఠాయిలు పంచి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు అమరావతి చేరుకోనున్నారు.

జెండా ఎగరవేసిన గవర్నర్

విజయవాడలోని ఇందిరా స్టేడియంలో గవర్నర్ నర్సింహన్ జెండా ఎగురవేశారు. అనంతరం భద్రతా దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి, మనవడు దేవాన్ష్ ఈ వేడుకలకు హాజరయ్యారు.

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu not able to attend republic day celebrations on Friday due to flight delay.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X