వెంకటేశ్వరస్వామితో పెట్టుకోవద్దు: బీజేపీ కుట్రలంటూ చంద్రబాబు ఫైర్
విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీపై బీజేపీ కుట్రలు పన్నుతోందని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. దేశంలోనే సాంప్రదాయాలు, పరిశుభ్రత పాటించే దేవాలయాల్లో తిరుమల వెంకటేశ్వరస్వామి దేవాలయం అగ్రభాగాన ఉంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు.
విశాఖ నగరంలో నిర్వహించిన ధర్మ పోరాట సభలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) వివాదంపై చంద్రబాబు స్పందించారు. 'ఆ రోజు ఎన్టీఆర్ చూపిన క్రమశిక్షణే వెంకటేశ్వరస్వామి ఆలయం శుభ్రతకు కారణం. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా నేను చేసిన విధానం. టీటీడీపై లేనిపోని అనుమానాలు కలిగిస్తున్నారు. ఇవన్నీ కుట్రలో భాగమే' అని చంద్రబాబు అన్నారు.
Recommended Video

'ఏదో విధంగా బీజేపీ ప్రభుత్వం నన్ను అప్రతిష్ట పాలు చేయాలి. రాష్ట్రాన్ని అప్రతిష్ట పాలు చేయాలి. ఇలాంటి కుట్రలు పన్ని. ఒక అతన్ని ఢిల్లీకి పిలిపించుకున్నారు. ప్రధాన అర్చకునితో తప్పుడు సమాచారం చెప్పించుకొనే పరిస్థితికి వస్తున్నారు. ఈయన కూడా ఈయన ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫొటో పక్కన రాజశేఖర్ రెడ్డి ఫొటో పెట్టుకొనే పరిస్థితికి వచ్చిందంటే ఆయన ఎలాంటి పామో ఆలోచించాలి' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

తమ ప్రభుత్వం బ్రాహ్మణుల కోసం ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని అన్నారు. ' బ్రాహ్మణుల్లో కూడా చాలా మంది పేదలవాళ్లు ఉన్నారు. వాళ్లను ఆదుకోవాలి. అందుకే ఒక కార్పొరేషన్ పెట్టి అర్చకులకు న్యాయం చేస్తున్నాం' అని చంద్రబాబు చెప్పారు. 'టీటీడీపై తప్పుడు ప్రచారం చేయాలని బీజేపీ ప్రోత్సహిస్తోంది. అంతేగాక, రాష్ట్ర ప్రభుత్వంపై కూడా బురద చల్లాలని చూస్తున్నారు. ఎప్పుడో జరిగిన విషయాలపై కమిషన్లు, జస్టిస్ ఎంక్వెయిరీలు వేసి ఎస్టాబ్లిస్ చేశారు' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
వెంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే వడ్డీతో సహా అపరాధం చెల్లించుకోవాల్సి వస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. కొద్ది రోజులుగా టీటీడీపై జరుగుతున్న దుష్ర్పచారంపై చంద్రబాబు మండిపడ్డారు. టీటీడీపై లేనిపోని అనుమానాలు సృష్టించేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'నాకు వెంకటేశ్వరస్వామిపై చాలా భక్తి. వెంకటేశ్వరస్వామి నన్ను ఎప్పుడూ ఆశీర్వదిస్తున్నారు. ఆ రోజు బ్రహ్మోత్సవాల సమయంలో ప్రభుత్వ లాంఛనాలు తీసుకు వెళ్తుంటే 24 గ్లేమోర్ మైన్స్ నాపై పేల్చినప్పుడు సాక్షాత్తు వెంకటేశ్వరస్వామే నా ప్రాణాలు కాపాడాడు. ఏదో ఒక పర్పస్ కోసం.. నాతో ఏదో ఒక పని చేపించాలని కాపాడాడు. ఎవరితోనైనా పెట్టుకోండి.. వెంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే వడ్డీతో సహా అపరాధం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎవరైనా మొక్కు కోరి ఒక్క రూపాయి అయినా ఇవ్వకపోయినా ఆయన వదిలిపెట్టరు. ఆయనకు అపచారం తలపెట్టిన వాడు... ఈ జీవితంలోనే తప్పకుండా పనిష్మెంట్లు తీసుకుంటారు. అది ఆయన కుండే మహిమ. అందుకనే ప్రతి ఒక్కరూ వెంకటేశ్వరస్వామి దగ్గరకి వస్తారు' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications