అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెజవాడ ఘటనపై జగన్ దిగ్ర్భాంతి: విచారణకు ఆదేశించిన చంద్రబాబు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: సోమవారం ఉదయం బెజవాడలో కలకలం సృష్టించిన కల్తీ మద్యం ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణకు ఆదేశించారు. కల్తీ మద్యం సేవించి అస్వస్థతకు గురై న బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని విజయవాడ ప్రభుత్వాసుపత్రి వైద్యులకు సూచించారు.

మరోవైపు ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ బెజవాడలో కల్తీ మద్యం ఘటనపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. కల్తీ మద్యం బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. బెజవాడ కృష్ణలంక స్వర్ణ‌బార్‌లో మద్యం సేవించి ఆరుగురు మృతి చెందగా, మరో 15మంది అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న వారిలో మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉంది.

Chandrababu Naidu orderd probe liquor incident in Vijayawada

మరోవైపు కల్తీ మద్యం సేవించి అస్వస్థతకు గురైన బాధితులను వైసీపీ నేత వంగవీటి రాధా పరామర్శించారు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆయన సోమవారం పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

చంద్రబాబు ఆదేశాల మేరకు కలెక్టర్ బాబు సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఘటనపై విజయవాడ సీపీ గౌతం సవాంగ్ మాట్లాడుతూ బార్‌లో సరైన ప్రమాణాలు పాటించక పోవడం వల్లనే ఈ ఘటన జరిగిందన్నారు.

ఈరోజు ఉదయం స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మెహాన్ రావుతో కలిసి ఆయన సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుపుతామన్నారు. ఇప్పటికే మద్యం శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు పంపించామన్నారు. కల్తీ మద్యం ఘటనను సీరియస్‌గా తీసుకుంటామన్నారు.

English summary
Six persons died and 17 others were hospitalized after they consumed liquor in a Swarna Bar at Krishnalanka area in Vijayawada on Monday. The victims, all daily labourers, consumed an unknown brand at around 10 a.m. and fell unconscious.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X