'ఓర్వలేకపోతున్నారు': చంద్రబాబుతో కర్నూలు జిల్లా టీడీపీ నేతల భేటీ
విజయవాడ: ఏపీలో అభివృద్ధిని చూసి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ముందుకొస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం ఆయన గుంటూరు జి్లాల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు కాటూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో 40 మంది సర్పంచ్‌లు తెలుగుదేశం పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ కష్టాలు శాశ్వతం కాదని, కష్టపడి పనిచేస్తే మంచిరోజులు వస్తాయని అన్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి అన్యాయం చేశారని ఆరోపించారు. రాజధాని నిర్మాణం కోసం రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చేందుకు ముందుకొచ్చారని కొనియాడారు.
రంగంలోకి వైఎస్ విజయమ్మ, సీన్ రివర్స్: జగన్ పార్టీలోనే భూమా నాగిరెడ్డి
రాష్ట్రాభివృద్ధిని చూసి కాంగ్రెస్, వైసీపీలు ఓర్వలేకపోతున్నాయని మండిపడ్డారు. ఈ ప్రపంచంలో రెండే కులాలున్నాయని చెప్పారు. ఒకటి డబ్బున్నోళ్లు, రెండోది డబ్బులేని వాళ్లు. కులాలకు అతీతంగా అందరికీ న్యాయం చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

కులాలు, మతాలు ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించి లాభపడాలని చూస్తున్నారని ప్రతిపక్షాలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతురుణమాఫీ చేశామని అన్నారు. ప్రతిపక్షాలు నదుల అనుసంధానంపై విమర్శుల చేస్తున్నాయని, ఇది ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
భూమాపై ఆశలు వదులుకున్న జగన్: తీవ్రమైన వ్యాఖ్య
తెలుగుదేశంలోకి చేరిన 40మంది సర్పంచ్‌లకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.
చంద్రబాబుతో కర్నూలు జిల్లా టీడీపీ నేతల భేటీ
కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి చేరనున్నట్లు శనివారం మీడియాలో వార్తలు వచ్చిన పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా టీడీపీ నేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సహా, కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
-
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..











Click it and Unblock the Notifications