విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జపాన్‌కు బాబు: 'బ్రాండ్ ఏపీ' దిశగా, రాజధాని పైన..

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నవంబర్‌లో జపాన్‌ను సందర్శించనున్నారు. చైనా, సింగపూర్, దక్షిణ కొరియాలు కూడా ఏపీలో పెట్టుపడులకు ఆసక్తి చూపిస్తున్నారని చంద్రబాబు చెబుతున్నారు. ఏపీలో అపార అవకాశాలు ఉన్నాయని, కాకినాడలో పెట్రో కెమికల్, పింగాణి పరిశ్రమకు రూ.లక్ష కోటల పెట్టుబడులు వస్తాయని చెబుతున్నారు. విజన్ 2029ని నిర్దేశించుకున్నామని, దీనికింద ఏడు లక్ష్యాలు ఏర్పర్చుకున్నట్లు తెలిపారు.

బ్రాండ్ ఏపీ దిశగా..

ఏపీని బ్రాండ్ ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం, పరిశ్రమలు కలిసి పని చేసేందుకు అవసరమైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. దేశఈయ పారిశ్రామిక దిగ్గజాలతో కలిసి ఏపీ ఆర్థికాభివృద్ధికి కార్యాచరణ రూపొందించింది. ఈ మేరకు 40 మంది సభ్యులతో పరిశ్రమలు, పెట్టుబడుల పైన టాస్క్‌ఫోర్స్ కమిటీని నియమించింది. ఈ కమిటీకి చంద్రబాబు అధ్యక్షుడిగా ఉంటారు. మూడు నెలలకు ఓసారి సమావేశమవుతారు.

Chandrababu Naidu plans riverside capital

కాగా, ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ పరిసరాల్లో ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారట. ఏపీ రాజధాని విజయవాడ - గుంటూరు మధ్యనే ఉంటే బాగుంటుందని భావిస్తున్నారట. కృష్ణానదికి ఇరువైపుల ప్రాంతాలను బ్రిడ్జిల ద్వారా కలిపి, అభివృద్ధి చేయాలనుకుంటున్నారు.

విజయవాడ సమీపంలో కృష్ణా నదికి ఇరువైపుల పదివేల ఎకరాల ప్రభుత్వం భూమి అందుబాటులో ఉందని గద్దె రామ్మోహన్ రావు అన్నారు. అలా కాకపోయినా నూజివీడు ప్రాంతంలో 30,000 ఏకరాలు అందుబాటులో ఉందన్నారు.

8 లైన్ల విజయవాడ ఫ్లై ఓవర్

విజయవాడ దుర్గ గుడి వద్ద గల ఫ్లై ఓవర్ నిర్మాణం డిజైన్‌ను ప్రభుత్వం సోమవారం ఖరారు చేసింది. ఫ్లై ఓవర్ ఎనిమిది లైన్లుగా ఉండనుందని తెలుస్తోంది.

English summary
The government buildings of the new capital of Andhra Pradesh may have a river view as Chief Minister Chandrababu Naidu wants them to come up on both banks of the river Krishna, from Nandigama to Vijayawada and from Amaravati to Tadepalli.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X